News July 20, 2024
రోహిత్ నుంచి మరో ‘డబుల్’ చూస్తామా?

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో డబుల్ సెంచరీ బాది దాదాపు ఏడేళ్లు అవుతోంది. చివరిసారిగా 2017లో ఆయన డబుల్ సెంచరీ సాధించారు. వచ్చే నెల 2 నుంచి శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తనకు అచ్చొచ్చిన లంకపై మరో డబుల్ సెంచరీ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా శ్రీలంకపై రోహిత్ రెండు ద్విశతకాలు బాదారు. ఓవరాల్గా మూడు డబుల్ హండ్రెడ్లు చేశారు.
Similar News
News October 20, 2025
DLS కంటే VJD మెథడ్ చాలా బెటర్: గవాస్కర్

IND, AUS మధ్య నిన్న జరిగిన తొలి వన్డేలో DLS మెథడ్పై దిగ్గజ క్రికెటర్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఎప్పటి నుంచో ఉన్నా DLS గురించి చాలా మందికి తెలియదు. దీనికి బదులు ఇండియన్ కనిపెట్టిన <<18056102>>VJD<<>> మెథడ్ చాలా బెటర్. ఇరు జట్లకు అనుకూలంగా ఉంటుంది. BCCI డొమెస్టిక్ క్రికెట్లో ఈ పద్ధతిని అనుసరించింది’ అని అన్నారు. కాగా నిన్న IND 26 ఓవర్లలో 136 రన్స్ చేయగా DLS ప్రకారం టార్గెట్ను 131కి తగ్గించడం తెలిసిందే.
News October 20, 2025
PGIMERలో ఉద్యోగాలు

చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(PGIMER)లో 4 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఈ నెల 30 ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS/BDSతో పీహెచ్డీ, ఎంఎస్సీ నర్సింగ్, MD/MS, GNM, ఇంటర్, డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://pgimer.edu.in/
News October 20, 2025
రాష్ట్రంలో తగ్గిన నూనె గింజ పంటల సాగు విస్తీర్ణం

AP: రాష్ట్రంలో ఈ ఏడాది నూనెగింజ పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది 17 లక్షల ఎకరాల్లో నూనెగింజల పంటలను సాగుచేయాలనుకోగా 6.50 లక్షల ఎకరాల్లో మాత్రమే వేరుశనగతో పాటు ఇతర నూనెగింజల పంటలు సాగయ్యాయి. వరి 38.97 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పత్తి 11 లక్షల ఎకరాల్లో, చెరకు 30 వేల ఎకరాలకే పరిమితమైంది. మొక్క జొన్న, సజ్జ, చిరుధాన్యాలు, కందులు, ఆముదం, జూట్ వంటి పంటలు లక్ష్యానికి మించి సాగయ్యాయి.