News March 19, 2024

లక్ష మెజార్టీతో గెలుస్తా: పవన్

image

AP: తనను పిఠాపురంలో పోటీ చేయాలని ఎక్కువ మంది కోరడంతోనే బరిలోకి దిగుతున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘నన్ను అసెంబ్లీ పంపిస్తామని హామీ ఇచ్చారు. ఆ ధీమాతోనే చెబుతున్నా.. లక్ష మెజార్టీతో గెలుస్తా. ప్రజాస్వామ్యంలో నాలాంటి వ్యక్తి గెలిస్తే రాష్ట్రానికి మంచిది కానీ నాకు కాదు. అలాంటిది నన్ను ఓడించడానికి ఓటుకు రూ.10వేలు, కుటుంబానికి రూ.లక్ష ఇస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు.

Similar News

News November 14, 2025

ట్రీ ఉమెన్ ఆఫ్ కర్ణాటక తిమ్మక్క కన్నుమూత

image

కర్ణాటకకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1911లో పేద కుటుంబంలో జన్మించిన తిమ్మక్క ట్రీ ఉమెన్ ఆఫ్ కర్ణాటకగా ప్రసిద్ధి చెందారు. దశాబ్దాలుగా రహదారుల వెంట 8వేలకు పైగా మొక్కలు నాటారు. వ్యవసాయ పనుల్లో కుటుంబానికి సహాయం చేసేందుకు చిన్నతనంలోనే చదువు మానేయాల్సి వచ్చింది. జీవితాంతం నిస్వార్థంగా ప్రకృతికి సేవ చేశారు.

News November 14, 2025

రాష్ట్రంలో BAM ₹1.1 లక్షల కోట్ల పెట్టుబడి: లోకేశ్

image

AP: ప్రముఖ బ్రూక్‌ఫీల్డ్ అసెట్స్ మేనేజ్మెంట్(BAM) కంపెనీ రాష్ట్రంలో ₹1.1 లక్షల CR పెట్టుబడి పెట్టనుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. రెన్యువబుల్ ఎనర్జీ, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజీ, సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో నిధులు వెచ్చించనుందని తెలిపారు. డేటా సెంటర్, రియల్ ఎస్టేట్, GCC, పోర్టులలోనూ పెట్టుబడి పెట్టనుందని ట్వీట్ చేశారు. వీటితో స్థిరమైన పెట్టుబడుల గమ్యస్థానంగా AP మారుతుందని పేర్కొన్నారు.

News November 14, 2025

బీజేపీకి షాక్.. డిపాజిట్ గల్లంతు

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ దక్కించుకోలేకపోయారు.