News August 1, 2024

సీఎం రేవంత్‌తో కలిసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా: జిష్ణుదేవ్

image

TG: గొప్ప సంస్కృతి, వారసత్వ సంపద కలిగిన తెలంగాణకు సేవ చేయడం గర్వంగా ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. ప్రమాణస్వీకారం అనంతరం మాట్లాడుతూ.. ‘యువ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గంతో కలిసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పాటుపడతా. రాజ్యాంగ విలువలకు కట్టుబడి పారదర్శకంగా విధులు నిర్వహిస్తా’ అని ప్రజలకు సందేశమిచ్చారు.

Similar News

News November 8, 2025

యసీన్ పటేల్ ఊచకోత.. భారత్ ఓటమి

image

హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో కువైట్ చేతిలో భారత్‌ ఓడిపోయింది. తొలుత కువైట్ 6 ఓవర్లలో 106-5 స్కోర్ చేసింది. ఆ జట్టులోని యసీన్ పటేల్ 14 బంతుల్లోనే 58 రన్స్(8 సిక్సర్లు,2 ఫోర్లు) చేశారు. చివరి ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 6, 6, 2 బాదారు. తర్వాత భారత్ 5.4 ఓవర్లలో 79 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. ఈ టోర్నీలో ఇరు జట్లు చెరో 6 ఓవర్లు ఆడతాయి. ఒక్కో టీమ్ నుంచి ఆరుగురు మాత్రమే బ్యాటింగ్ చేస్తారు.

News November 8, 2025

న్యూస్ అప్‌డేట్స్ 10@AM

image

* తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న A-16 అజయ్ కుమార్ సుగంధ్‌ అరెస్టు. భోలేబాబా కంపెనీకి కెమికల్స్ ఉన్న పామాయిల్ సప్లై చేసినట్లు గుర్తింపు
*తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. పలమనేరులో కుంకీ ఏనుగుల క్యాంపును సందర్శించనున్న పవన్
*బిహార్ తొలి దశ పోలింగ్‌లో 65.08% ఓటింగ్ నమోదు: ఈసీ
*ఢిల్లీలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని విమాన సర్వీసులు

News November 8, 2025

PDILలో 87 ఇంజినీర్ ఉద్యోగాలు

image

నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్(<>PDIL<<>>)87 కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీడీఎం, BCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.pdilin.com