News September 6, 2024
పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తా: మహేశ్ కుమార్

కాంగ్రెస్ అధిష్ఠానం తనకు TPCC చీఫ్ బాధ్యతలు అప్పగించడంపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిర్దేశానుసారం, సీనియర్ల మార్గదర్శకత్వంలో పని చేస్తానన్నారు. తెలంగాణ ప్రజల సేవలో పార్టీని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.
Similar News
News December 21, 2025
దూసుకెళ్తున్న మహాయుతి

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల కౌంటింగ్‌లో మహాయుతి కూటమి దూసుకెళ్తోంది. 246 మున్సిపల్ కౌన్సిల్ స్థానాలు, 42 నగర పంచాయతీల్లో బీజేపీ 116+, శివసేన 50+, ఎన్సీపీ 34+ చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. శివసేన యూబీటీ 12, ఎన్సీపీ(SP) 12, కాంగ్రెస్ 28+ స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి.
News December 21, 2025
గిల్‌పై వేటు.. సూర్యకూ అల్టిమేటం!

T20ల్లో విఫలమవుతున్న గిల్‌ను వరల్డ్‌కప్ నుంచి BCCI <<18622627>>తప్పించిన<<>> విషయం తెలిసిందే. ఈ క్రమంలో రన్స్ చేయలేక తంటాలు పడుతున్న కెప్టెన్ సూర్య కుమార్‌కూ బోర్డు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఫామ్‌ను అందుకోలేకపోతే జట్టులో చోటు కోల్పోవచ్చని హెచ్చరించినట్లు సమాచారం. ‘ఏడాదిగా పరుగులు చేయకున్నా కెప్టెన్ కావడం వల్ల జట్టులో ఉన్నాడు. పరుగులు చేయకపోతే గిల్ మాదిరే సూర్యపై వేటు పడొచ్చు’ అని PTI కథనం పేర్కొంది.
News December 21, 2025
ప్రపంచంలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు ఇవే.. మనవెక్కడ?

ప్రపంచంలోని బిజీయెస్ట్ రైల్వే స్టేషన్ల లిస్ట్‌లో జపాన్ టాప్‌లో ఉంది. టోక్యోలోని ‘షింజుకు’ ఏడాదికి 116 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలతో తొలి స్థానంలో నిలిచింది. టాప్ 10లో ఏకంగా 8 ఆ దేశంలోనే ఉన్నాయి. ఇండియా నుంచి కోల్‌కతాలోని హౌరా స్టేషన్ 54 కోట్ల మందితో ఆరు, సియాల్దా స్టేషన్ ఎనిమిదో ప్లేస్‌లో ఉన్నాయి. అధిక జనసాంద్రత, రోజూ ఆఫీసులకు వెళ్లేవారి రద్దీ వల్లే ఈ స్టేషన్లు ఎప్పుడూ కిక్కిరిసిపోతున్నాయి.


