News July 15, 2024
నన్ను కలిస్తే సంబంధం అంటగడతారా?: విజయసాయి రెడ్డి

AP: తన వ్యక్తిత్వంపై కుట్రపూరితంగానే అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని YCP MP విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ‘ఓ ఆదివాసీ మహిళను బజారుకీడ్చారు. ఎంపీనైన నన్ను ఎంతోమంది కలుస్తారు. అంతమాత్రాన <<13630730>>సంబంధం<<>> అంటగడతారా? తారతమ్యాలు లేవా? సాయిరెడ్డి తండ్రిలాంటి వ్యక్తి అని ఆమెనే చెప్పింది. ఆరోపణలు చేసినవారిపై కేసులు పెడతా. త్వరలోనే ఛానల్ ప్రారంభించి వారి కుట్రలను ఎండగడతా’ అని తెలిపారు.
Similar News
News December 20, 2025
పొగమంచు అడ్డంకి.. మోదీ చాపర్ యూటర్న్

PM మోదీ పర్యటనకు పొగమంచు అడ్డంకిగా మారింది. కోల్‌కతా విమానాశ్రయం నుంచి పశ్చిమ బెంగాల్ నాడియా జిల్లాలోని తాహెర్‌పుర్ హెలిప్యాడ్‌కు బయల్దేరిన మోదీ హెలికాప్టర్ దట్టమైన పొగమంచు కారణంగా ల్యాండ్ కాలేకపోయింది. కొద్దిసేపు చక్కర్లు కొట్టిన తర్వాత చాపర్ తిరిగి కోల్‌కతాకు వెళ్లిపోయింది. NH ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన PM, వాతావరణం అనుకూలించక వర్చువల్‌గానే మాట్లాడారు.
News December 20, 2025
యాషెస్ మూడో టెస్ట్.. గెలుపు దిశగా ఆసీస్

యాషెస్ 3rd టెస్టులో ఆస్ట్రేలియా విజయానికి 4 వికెట్ల దూరంలో ఉంది. 4th రోజు ఆట ముగిసే సమయానికి ENG రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 207 రన్స్ చేసింది. J స్మిత్(2), జాక్స్(11) క్రీజులో ఉన్నారు. జాక్ క్రాలీ 85 పరుగులతో రాణించారు. కమిన్స్, లయన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ENG గెలవాలంటే ఇంకా 228 రన్స్ చేయాలి. ఇప్పటికే తొలి 2 టెస్టులు గెలిచిన AUS ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది.
News December 20, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


