News March 22, 2025
వ్యంగ్యంగా మాట్లాడితే కేసులు పెడతారా?: అంబటి

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళి హాస్యనటుడు కాబట్టి వ్యంగ్యంగా మాట్లాడారని, అంతమాత్రానికే కేసులు పెడతారా అని YCP నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. మరి దగ్గుబాటి కూడా చంద్రబాబుపై వ్యంగ్యంగా మాట్లాడారు కాబట్టి ఆయనను అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. ‘YCP నేతలపై అక్రమ కేసులు పెట్టిన ఎవరినీ వదిలేది లేదు. మా లీగల్ టీమ్ స్ట్రాంగ్‌గా ఉంది. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా క్షణాల్లో వస్తాం’ అని పేర్కొన్నారు.
Similar News
News January 2, 2026
పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే మృతి

AP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన (68) ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆమె విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1983లో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి తొలిసారి సుమన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే 1984లో నక్కపల్లిలో బాలికల గురుకులం ఏర్పాటైంది.
News January 2, 2026
మాటపై ఉంటారా? టికెట్ రేట్స్ పెంచుతారా?

TG: పుష్ప 2 విషాదం తర్వాత సినిమాల టికెట్ రేట్స్ పెంచమని CM రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఆ తర్వాత పలు మూవీస్ రేట్ పెంపుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇటీవల అఖండ-2కు ధరలు పెంచగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తనకు తెలియకుండా అధికారులే ఆదేశాలిచ్చారని, ఇకపై ఇలా జరగదని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఇప్పుడు సంక్రాంతి బరిలోని ‘రాజాసాబ్, మన శంకర వరప్రసాద్‌గారు’లకూ ఇది వర్తిస్తుందా? చూడాలి.
News January 2, 2026
పార్టీయే ప్రాణం.. భర్తకు గుడ్‌బై!

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ రాజకీయాల్లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. BJP పట్ల విధేయత కారణంగా మాజీ మేయర్ అర్చన దేహంకర్ తన భర్త వినాయక్ దేహంకర్‌ను వదిలేసి పుట్టింటికి వెళ్లారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో వినాయక్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం వివాదానికి దారి తీసింది. దీనిని పార్టీకి వెన్నుపోటుగా ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.


