News August 4, 2024

బోణీ కొడతారా?

image

తొలి వన్డేలో చేజేతులా విజయాన్ని చేజార్చుకున్న భారత్, నేడు శ్రీలంకతో రెండో వన్డే ఆడనుంది. తొలి మ్యాచులో పొరపాట్లను రిపీట్ చేయకుండా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని రోహిత్ సేన చూస్తోంది. వికెట్ కీపర్ పంత్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉండగా పరాగ్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. రోహిత్, రాహుల్ మినహా మిగతా బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది.

Similar News

News April 4, 2026

దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్లను కోల్పోవు: మోదీ

image

నియోజకవర్గాల పునర్విభజన అంశంపై PM మోదీ కేరళం ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్లు కోల్పోతాయని విపక్షాలు చేస్తున్న వాదనలను ఖండించారు. అదంతా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. అలాగే శబరిమల బంగారం దొంగతనం వివాదంపై స్పందిస్తూ ‘LDF, UDFలు ఆలయ ఖ్యాతిని తగ్గించేందుకు ప్రయత్నించాయి. NDA అధికారంలోకి రాగానే నిందితులను శిక్షిస్తాం’ అని తెలిపారు.

News April 4, 2026

రాజస్థాన్ బ్యాటింగ్.. GT కెప్టెన్‌గా రషీద్

image

IPL: గుజరాత్‌పై RR టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. GT కెప్టెన్ గిల్ అనారోగ్యంతో దూరం కాగా రషీద్ ఖాన్ కెప్టెన్సీ చేస్తున్నారు.
RR: జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, జురెల్, పరాగ్ (C), హెట్మెయిర్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ
GT: కుశాగ్ర, సాయి సుదర్శన్, బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ (C), రబాడ, అశోక్ శర్మ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

News April 4, 2026

వెయ్యేళ్లయినా తేనె పాడవదు!

image

ఆహార పదార్థాల్లా కాకుండా స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ పాడవదనే విషయం మీకు తెలుసా? ఈజిప్టు పిరమిడ్లలో జరిపిన తవ్వకాల్లో 3 వేల ఏళ్ల క్రితం నాటి తేనె కుండలు లభించాయి. శాస్త్రవేత్తలు పరీక్షించినప్పుడు ఆ తేనె ఇప్పటికీ తాజాగా ఉంది. తక్కువ తేమ, అధిక ఆమ్లత్వం & తేనెటీగల ఎంజైమ్‌లే దీనిని బాక్టీరియా నుంచి రక్షించి నిల్వ ఉండేలా చేస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(37/100)