News April 24, 2025
ఆఫీస్‌కు వస్తారా.. మానేస్తారా?.. గూగుల్ అల్టిమేటం

ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు గూగుల్ అల్టిమేటం జారీ చేసింది. ఆఫీస్‌కు వస్తారా లేక పూర్తిగా మానేస్తారా అని ప్రశ్నిస్తూ ఉద్యోగులకు ఈ-మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో పనిచేయాలని, ఇంటి నుంచే పనిచేస్తామంటే కుదరదని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఏఐకి ప్రాధాన్యాన్ని ఇస్తున్న గూగుల్ ఇప్పటికే వేలాదిమంది ఉద్యోగుల్ని తొలగించింది.
Similar News
News April 24, 2025
పాక్ నటుడి సినిమాపై నిషేధం

పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘అబిర్ గులాల్’ సినిమాపై భారత సమాచార శాఖ నిషేధం విధించింది. 9 ఏళ్ల తర్వాత ఈ పాక్ నటుడు బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన క్రమంలో పహల్‌గామ్ ఉగ్రదాడి కలకలం రేపింది. ఈ నరమేధం వెనుక పాక్ హస్తం ఉందని తేల్చిచెప్పిన భారత్ పాక్ సినిమాలు, నటులపై బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మే 9న రిలీజ్ కావాల్సి ఉన్న సినిమా ఆగిపోయింది.
News April 24, 2025
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై రాజధాని, రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. మే 2న అమరావతి పర్యటనకు రావాలని ఆయనను ఆహ్వానిస్తారని సమాచారం.
News April 24, 2025
పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు: బీసీసీఐ

ఇకపై భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఉండబోవని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. IND, PAK మధ్య చివరగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి ICC టోర్నీల్లో మాత్రమే IND, PAK తలపడుతున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో ఇక భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించవద్దని BCCI నిర్ణయించినట్లు తెలుస్తోంది.