News April 21, 2024
మెజార్టీలో రికార్డు సృష్టిస్తారా?2/2

AP: YS కుటుంబానికి కంచుకోటైన కడప(D) పులివెందులలో 1978 నుంచి ఆ కుటుంబ సభ్యులే విజయ దుందుభి మోగిస్తున్నారు. ఇక్కడ 2014, 2019 ఎన్నికల్లో CM జగన్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2014లో ప్రత్యర్థి సతీశ్ కుమార్‌పై 75,243 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లో 90,110 మెజార్టీ, 50.2 శాతం ఓట్లు పొంది రికార్డు సృష్టించారు. మరి ఈ ఎన్నికల్లో గత మెజార్టీ మార్క్‌ను ఆయన క్రాస్ చేస్తారేమో చూడాలి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News April 4, 2026
మహిళలను వేధించే వారిని ఉపేక్షించొద్దు: CBN

AP: మాచర్లలో ఉద్యోగినిపై అత్యాచారయత్న ఘటనలో నిందితుణ్ని త్వరగా అరెస్టు చేయాలని CM CBN పోలీసులను ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడే వారిని ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పాలని సూచించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని అధికారులు CMకు తెలిపారు. కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. బాధితురాలికి గుంటూరు GGHలో చికిత్స అందిస్తున్నామన్నారు.
News April 4, 2026
పాక్‌పై భారత్ మరోసారి దాడి చేస్తుందా?

పశ్చిమాసియా యుద్ధంతో పాక్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. దీన్నే అవకాశంగా మలుచుకొని దాయాదిని దెబ్బకొట్టాలని IND భావిస్తోందా? ఉగ్రవాదాన్ని పోషిస్తూ కంట్లో నలుసులా మారిన PAKను OpS-2తో నాశనం చేయడానికి సిద్ధమవుతోందా? త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ భేటీలు, పాక్‌కు <<19547918>>వార్నింగ్<<>>, రాష్ట్రాల్లో మాక్ డ్రిల్, ప్రజలకు 3 నెలల రేషన్(యుద్ధం వస్తే ఇబ్బంది పడకుండా) సరఫరా ఈ ప్రశ్నలకు బలం చేకూరుస్తున్నాయి.
News April 4, 2026
BRS ఖాతాలో మరో రెండు మున్సిపాలిటీలు

TG: గతంలో వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాలను BRS కైవసం చేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య తాజాగా జరిగిన ఎన్నికలో రెండు మున్సిపాలిటీలను ఖాతాలో వేసుకుంది. క్యాతనపల్లి ఛైర్మన్‌గా గొడిశెల సంధ్యారాణి, ఇబ్రహీంపట్నం ఛైర్మన్‌గా సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు.


