News October 6, 2024
రూ.కోట్ల ఇళ్లు కూల్చేసి డబుల్బెడ్రూం ఇస్తావా?: ఈటల

TG: ‘మూసీ కూల్చివేతల’పై CM రేవంత్కు BJP MP ఈటల లేఖ రాశారు. ‘మూసీ సుందరీకరణ పేరిట మాల్స్ కట్టి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావా? మూసీ ప్రక్షాళనకు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? DPR ఉందా? ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయం ఏంటి? రూ.కోట్ల విలువ చేసే ఇళ్లు కూల్చేసి డబుల్ బెడ్రూం ఇస్తా అంటే ఎలా? అంతపెద్ద గంగా ప్రక్షాళనకే రూ.22వేల కోట్లు ఖర్చు. మూసీకి రూ.1.50లక్షల కోట్లెందుకు?’ అని ప్రశ్నించారు.
Similar News
News February 1, 2026
ఇంటర్నేషనల్ రెడ్ శాండల్ స్మగ్లర్ అరెస్ట్

AP: విదేశాలకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న మొహమ్మద్ ముజామిల్ అనే వ్యక్తిని చిత్తూరు-నాయుడుపేట NHపై అరెస్టు చేసినట్లు తిరుపతి జిల్లా పోలీసులు వెల్లడించారు. చైనాలోని జైమెన్ టాంగాంగ్ ఫాంగ్ ట్రేడ్ కంపెనీతో ఇతడికి సంబంధాలు ఉన్నాయని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. కాగా గత నెల చిత్తూరు పర్యటనలో ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
News January 31, 2026
‘ధురంధర్’లో తెలుగు నటులు.. గ్రోక్ ఎంపిక ఇదే

‘ధురంధర్’ OTTలోకి రావడంతో నెట్టింట దానిపైనే చర్చ జరుగుతోంది. అందులోని క్యారెక్టర్లకు ఏ తెలుగు నటులు సెట్ అవుతారో చెప్పాలని ఓ నెటిజన్ ‘గ్రోక్’ను అడిగాడు. హంజా (రణ్వీర్ సింగ్)కు జూనియర్ ఎన్టీఆర్, రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా)- రానా దగ్గుబాటి, మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్)- ప్రభాస్, SP అస్లాం (సంజయ్ దత్)- వెంకటేశ్, యెలీనా (సారా అర్జున్)- సమంత, అజయ్ సన్యాల్ (మాధవన్)కు రామ్ చరణ్ అని చూపించింది.
News January 31, 2026
హైకోర్టులో అంబటి భార్య హౌస్ మోషన్ పిటిషన్

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనతో సహా 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆమె తెలిపారు. 24 గంటలపాటు తమకు భద్రత కల్పించాలని కోరారు. సీఎం చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే.


