News March 19, 2024
తీహార్ జైలులో కవితను కలుస్తా: సుకేశ్

TG: తీహార్ జైలు క్లబ్‌లో త్వరలో సభ్యులు కాబోతున్నారంటూ MLC కవితను ఉద్దేశించి మనీలాండరింగ్ కేసు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ లేఖ రాశారు. ‘మా గ్రేటెస్ట్ తీహార్ జైలుకు మీకు స్వాగతం. మీ కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. త్వరలోనే మిమ్మల్ని ఇక్కడ కలుస్తా. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, సీఎం కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి. సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంది’ అని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News March 7, 2026
హెలికాప్టర్‌లో పొగలు.. యూపీ Dy.CMకు తప్పిన ప్రమాదం

యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్యాబిన్‌లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. పైలట్ అప్రమత్తమై వెంటనే లక్నోలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో మౌర్యతో సహా ఐదుగురు హెలికాప్టర్‌లో ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News March 7, 2026
డేరా బాబాకు భారీ ఊరట

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(డేరా బాబా)కు భారీ ఊరట లభించింది. 20 ఏళ్ల కిందట జరిగిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ పంజాబ్-హరియాణా హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2019లో కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను రద్దు చేసింది. కాగా మహిళలపై అత్యాచారం కేసులో 2017 నుంచి డేరా బాబా జైలులో ఉన్నప్పటికీ దాదాపు 15 సార్లు పెరోల్‌పై బయటికొచ్చి వెళ్లారు.
News March 7, 2026
గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ ప్రెసిడెంట్!

US-ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై చేస్తున్న దాడులకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. ఇతర దేశాలను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని స్పష్టంచేశారు. తమపై పొరుగు దేశాలు దాడి చేయకపోతే వాటిపై అటాక్ చేయొద్దనే నిర్ణయాన్ని తాత్కాలిక నాయకత్వ మండలి ఆమోదించిందని తెలిపారు. అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.


