News January 8, 2025

వైకుంఠ దర్శనం కోరితే వైకుంఠానికి పంపుతారా: VHP

image

తిరుపతి తొక్కిసలాటలో భక్తురాలి మృతిపై VHP రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు వైకుంఠ దర్శన టికెట్ల కోసం వస్తే ఏకంగా వైకుంఠానికి పంపే దుస్థితి TTDలో ఉందని ధ్వజమెత్తారు. 5 లక్షల మంది హాజరైన హైందవ శంఖారావం చక్కగా జరిగితే, నేడు TTD 75 వేల మంది వస్తేనే ఇలా చేసిందన్నారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వడంతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Similar News

News December 5, 2025

నాలుగు వేదాల ప్రతీక ‘తిరుమాడ వీధులు’

image

తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ 4 దిక్కులా ఉన్న వీధులను తిరుమాడ వీధులు అంటారు. వీటిని 4 వేదాలకు ప్రతీకగా భావిస్తారు. భగవద్రామానుజులవారు స్వామివారి ఊరేగింపుల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి వాహన సేవలు ఈ పవిత్ర వీధులలోనే వైభవంగా జరుగుతాయి. వీటి పవిత్రత కారణంగా, ఈ మాడ వీధుల్లో పాదరక్షలు ధరించడం నిషేధం. ఈ వీధులు స్వామివారి వైభవాన్ని లోకానికి చాటిచెబుతాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 5, 2025

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

image

పండ్లు, కూరగాయలను వండే ముందు, తినే ముందు తప్పనిసరిగా నీటితో కడగాలి. కాస్త ఉప్పు లేదా వెనిగర్ లేదా పసుపు కలిపిన నీటిలో కాసేపు ఉంచి కడిగితే పండ్లు, కూరగాయలపై చేరిన పురుగు మందుల అవశేషాలను తొలగించవచ్చు. కొన్ని పురుగు మందులు వాటి గాఢతను బట్టి కూరగాయల ఉపరితలం నుంచి తొక్క లోపలి పొరల వరకు చొచ్చుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు తొక్క తొలగించి తీసుకోవడం మరింత మంచిది.

News December 5, 2025

సీఎం ఓయూ పర్యటన వాయిదా

image

TG: ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా ఈ నెల 7న ఓయూకు వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పులు జరిగాయి. ఎల్లుండికి బదులుగా ఈ నెల 10న సీఎం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు.