News March 20, 2024
కంచుకోటను దక్కించుకునేందుకు బరిలో నిలుస్తారా? – 1/2

గత ఎన్నికల్లో చేజారిన అమేథీని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఇక్కడ అభ్యర్థిగా ఎవరనేది చర్చనీయాంశమైంది. వయనాడ్ నుంచి బరిలోకి దిగనున్న రాహుల్ మరోసారి అమేథీలోనూ నిలబడాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయట. మరోవైపు ఆ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో రాయ్బరేలీ సీటు ఖాళీ అయింది. ఇక్కడ ప్రియాంక గాంధీ బరిలో దిగే అవకాశం ఉంది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 7, 2025
కృష్ణా జిల్లాలో వరి కోతలు ప్రారంభం.. కూలీలకు ఉపాధి.!

దిత్వా తుఫాన్ అనంతరం వాతావరణం అనుకూలించడంతో జిల్లాలో వరి కోత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా యంత్రాలపై ఆధారపడటంతో కూలీలకు ఉపాధి నిలిచిపోయింది. అయితే, ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో రైతులు యంత్రాల వినియోగాన్ని తగ్గించి, తిరిగి కూలీలతో వరి కోతలను ప్రారంభిస్తున్నారు. దీంతో నిలిచిపోయిన కూలీలందరికీ మళ్లీ ఉపాధి లభించే అవకాశం ఏర్పడింది.
News December 7, 2025
ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతాం: ఇండిగో

ఇండిగో విమానాల సంక్షోభం ఆరో రోజూ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్టుల్లో పదుల సంఖ్యలో సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఒక్క హైదరాబాద్లోనే 100 దాకా రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు. అయితే ఆదివారం కావడంతో రద్దీ కాస్త తగ్గినట్లు సమాచారం. మరోవైపు 95 శాతం కనెక్టివిటీని పునరుద్ధరించామని ఇండిగో చెబుతోంది. ఇవాళ 1,500 సర్వీసులు నడుపుతామని తెలిపింది.
News December 7, 2025
రబీ నువ్వుల సాగుకు అనువైన రకాలు

☛ ఎలమంచిలి 11(TNN వరాహ): పంట కాలం 80-85 రోజులు. నూనె 52%గా ఉంటుంది. దిగుబడి ఎకరాకు 300-350 కిలోలు. ఇది ముదురు గోధుమ రంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు ఈ రకం అనుకూలం.
☛ ఎలమంచిలి 17: పంటకాలం 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 340-400 కిలోలు. గింజల్లో నూనె 52.5%గా ఉంటుంది. ఇది లేత గోధుమ రంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు అనుకూలం. ఆకుమచ్చ తెగులను కొంత వరకు తట్టుకుంటుంది.


