News February 11, 2025

కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన విలియమ్సన్

image

న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ మరో రికార్డు కొల్లగొట్టారు. వన్డేల్లో అత్యంత వేగంగా 7,000 పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా కేన్ నిలిచారు. 159 ఇన్నింగ్సుల్లోనే ఆయన ఈ ఫీట్ సాధించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (161 ఇన్నింగ్సులు) రికార్డును విలియమ్సన్ అధిగమించారు. ఫాస్టెస్ట్ 7,000 రన్స్ రికార్డు హషీమ్ ఆమ్లా (150 ఇన్నింగ్సులు) పేరిట ఉంది. ఈ ముగ్గురి తర్వాత డివిలియర్స్ (166 ఇన్నింగ్సులు) ఉన్నారు.

Similar News

News December 5, 2025

‘పుష్ప-2’కు ఏడాది.. అల్లుఅర్జున్ స్పెషల్ ట్వీట్

image

‘పుష్ప2’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ప్రేక్షకుల నుంచి లభించిన అపారమైన ప్రేమ తమకు మరింత ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిత్రాన్ని అద్భుతంగా మార్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కెప్టెన్’ సుకుమార్ సహా చిత్రబృందానికి ధన్యవాదాలు చెప్పారు. ‘పుష్ప’గా ఈ 5ఐదేళ్ల ప్రయాణం తన జీవితంలో మరువలేనిదని కొనియాడారు.

News December 5, 2025

ఏపీలో తొలి సోలార్ వేఫర్ యూనిట్: నారా లోకేశ్

image

AP: దేశంలోనే తొలి సోలార్ ఇంగోట్ వేఫర్ తయారీ యూనిట్ ఏపీలో ఏర్పాటవుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. అనకాపల్లిలో ReNewCorp రూ.3,990 కోట్ల పెట్టుబడితో 6GW సామర్థ్యంతో ఈ యూనిట్‌ను స్థాపించనున్నట్లు ‘X’ వేదికగా వెల్లడించారు. CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో కుదిరిన MoU ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని పేర్కొన్నారు.

News December 5, 2025

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో 19 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో హెడ్ SeMT, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE/B.Tech/BCA/BSc(IT)/BSc(CS), M.Tech/MS/MBA/MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://ora.digitalindiacorporation.in