News April 19, 2024

మళ్లీ వరి సాగుకే మొగ్గు!

image

తెలంగాణలో ఈ ఏడాది వానాకాలంలో రైతులు వరి సాగుకు పెద్దపీట వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఈసారి దాదాపు 65లక్షల ఎకరాల్లో వరి, 53లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని భావిస్తోంది. ఈమేరకు వానాకాలం సీజన్‌కు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసింది. గత వానాకాలంలో 64లక్షల ఎకరాల్లో వరి, 44.77లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. పంటల సాగు అంచనాల మేరకు విత్తనాల సరఫరాకు సన్నాహాలు చేస్తోంది.

Similar News

News January 22, 2026

తెలుగు రాష్ట్రాల్లో సరస్వతీ దేవి ఆలయాలు

image

వసంత పంచమి నాడు తెలుగు రాష్ట్రాల్లోని సరస్వతీ క్షేత్రాలు భక్తజనంతో పోటెత్తుతాయి. TGలోని నిర్మల్ జిల్లాలో బాసర జ్ఞాన సరస్వతి ఆలయం అక్షరాభ్యాసాలకు ప్రసిద్ధి. సిద్దిపేట(D) వర్గల్ విద్యా సరస్వతి క్షేత్రం కూడా ఎంతో విశిష్టమైనది. APలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు పండుగ రోజు సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తారు. మెదక్(D) ముక్తేశ్వర క్షేత్రం, అనంతపురం(D) హేమావతి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేస్తారు.

News January 22, 2026

చిరంజీవి మూవీ టికెట్ రేట్లు తగ్గింపు

image

AP: చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ టికెట్ రేట్స్ తగ్గాయి. ప్రభుత్వం తొలి 10రోజులు మల్టీప్లెక్సుల్లో రూ.120, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100 పెంచుకునే అనుమతి ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో సాధారణ రేట్లకే టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. TGలోనూ టికెట్స్ నార్మల్ రేట్లకే అందుబాటులో ఉన్నాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.300+ కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.

News January 22, 2026

PM తర్వాత గంభీర్‌దే టఫ్ జాబ్: శశి థరూర్

image

నాగ్‌పూర్‌లో హెడ్ కోచ్ గంభీర్‌ను కలిసినట్లు MP శశి థరూర్ పేర్కొన్నారు. ‘నా ఓల్డ్ ఫ్రెండ్‌తో మంచి డిస్కషన్ చేశాను దేశంలో PM తర్వాత గంభీర్ అత్యంత కష్టమైన ఉద్యోగం చేస్తున్నారు. రోజూ లక్షలమంది విమర్శిస్తున్నా ధైర్యంగా నడుస్తున్నారు. ఆయనకు అన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. గంభీర్ ఆయనకు థాంక్స్ చెప్పారు. పరిస్థితులు చక్కబడితే కోచ్ బాధ్యతలపై క్లారిటీ వస్తుందని ట్వీట్ చేశారు.