News June 5, 2024
EVM లెక్కింపులో ఒక్క ఓటుతో గెలుపు.. పోస్టల్ బ్యాలెట్లో తారుమారు!

మహారాష్ట్రలోని ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారం కేవలం 48 ఓట్లతో గెలుపొందారు. EVM ఓట్ల లెక్కింపు తర్వాత శివసేన అభ్యర్థి అమోల్ గజానన్ కీర్తికర్ కేవలం ఒక్క ఓటు ఆధిక్యంలో ఉన్నారు. అయితే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత దత్తారం 48 ఓట్లు ఆధిక్యం సాధించి ఎంపీగా విజయం సాధించారు.
Similar News
News November 24, 2025
హేమమాలినితో హగ్స్ కోసం ధర్మేంద్ర ఏం చేశారంటే..?

‘షోలే’ మూవీ షూటింగ్లో<<18374925>>ధర్మేంద్ర<<>> ఓ కొంటె పని చేశారు. హీరోయిన్ హేమమాలినితో హగ్స్ కోసం స్పాట్ బాయ్స్‌కు లంచం ఇచ్చారు. షాట్ మధ్యలో అంతరాయం కలిగించాలని వారికి చెప్పారు. రీటేక్ తీసుకునేలా చేసినందుకు ₹20 చొప్పున ₹2 వేలు స్పాట్ బాయ్స్‌కు ఇచ్చారు. అంటే దాదాపు 100 వరకు రీటేక్స్ తీసుకున్నారు. షోలే 1975లో రిలీజ్ కాగా, వీరిద్దరూ నాటకీయ పరిణామాల మధ్య 1980లో పెళ్లి చేసుకున్నారు.
News November 24, 2025
ఢిల్లీ కాలుష్యం: సగం మందే ఆఫీసులకు

గాలి కాలుష్యం తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులను 50% మందితోనే నిర్వహించాలని, మిగతా వారు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలిచ్చింది. GRAP-3లో భాగంగా వాహనాల రాకపోకలను నియంత్రించాలన్న ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ క్వాలిటీ తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లలను బహిరంగ ప్రదేశాల్లో ఆడుకోనివ్వొద్దని ఇప్పటికే ఆంక్షలు విధించింది.
News November 24, 2025
ఐబొమ్మ రవి.. విచారణలో సంచలన విషయాలు!

ఐబొమ్మ రవి మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ కలిగి ఉన్నాడని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇవాళ అతడి మాజీ భార్యనూ పోలీసులు విచారించారు. తనతో పాటు కూతురిని చిత్రహింసలకు గురిచేశాడని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. రవి ప్రవర్తన నచ్చకనే విడాకులు ఇచ్చినట్లు ఆమె వెల్లడించారని వార్తలు వస్తున్నాయి. స్నేహితుడు నిఖిల్‌కు నెలకు రూ.50వేలు ఇచ్చి ఐబొమ్మ సైట్ పోస్టర్లు డిజైన్ చేయించుకున్నట్లుగా గుర్తించారు.


