News April 2, 2025
గెలిచినా, ఓడినా ఒకేలా ఉండండి.. LSG ఓనర్‌కు నెటిజన్ల క్లాస్!

నిన్నటి మ్యాచ్‌లో PBKSపై LSG ఓడిపోవడంతో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ పంత్‌పై సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మొన్న మ్యాచ్ గెలిచినప్పుడు ఈయనే పంత్‌కు సెల్యూట్ చేస్తూ, హత్తుకుంటూ అభినందించారు. గెలిచినప్పుడు ఒకలా.. ఓడినప్పుడు మరోలా ప్రవర్తించడంపై విమర్శలొస్తున్నాయి. ఇలా చేయడం కరెక్ట్ కాదని, ఓటమిలో ప్లేయర్లకు అండగా ఉండి వారిని ఎంకరేజ్ చేయాలని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.
Similar News
News April 3, 2025
ట్రంప్ టారిఫ్‌లు, చైనా ఆక్రమణలపై ఏం చెప్తారు?: రాహుల్

భారత్ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌ల అంశాన్ని LOP రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రస్తావించారు. ‘ఈ టారిఫ్‌లపై కేంద్రం స్పందించాలి. ఈ సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూరుస్తాయి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అటు భారత్‌కు చెందిన 4వేల చ.కి.మీపైగా భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అక్కడి రాయబారి ద్వారా ఈ విషయం తెలిసిందని సంచలన ఆరోపణలు చేశారు.
News April 3, 2025
రుషికొండ భవనాలపై ఏం చేద్దాం?.. మంత్రులతో సీఎం చర్చ

AP: జగన్ హయాంలో విశాఖ రుషికొండపై నిర్మించిన భవనాలను ఏం చేయాలన్న అంశంపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. మొదట మినిస్టర్లంతా ఆ బిల్డింగులను సందర్శించి అభిప్రాయాలు చెప్పాలని ఆయన సూచించారు. ఈ భవనాలను నిర్మించి జగన్ ప్రజాధనం వృథా చేశారని కూటమి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే అవి నిబంధనల మేరకు నిర్మించిన ప్రభుత్వ అతిథి గృహాలని వైసీపీ స్పష్టం చేస్తోంది.
News April 3, 2025
మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్లుగా మార్చే ప్రయత్నం: కాంగ్రెస్ MP

దేశంలో ముస్లింలను సెకండ్ క్లాస్ సిటిజన్లుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నాజిర్ హుస్సేన్ ఆరోపించారు. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన 123 ఆస్తులపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. అసత్య ప్రచారాలతో దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.