News April 4, 2024
‘గాలి’ మళ్లీ బీజేపీవైపు వీచింది!

ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీ క్యాంప్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఇటీవల తిరిగి బీజేపీలో చేరి.. తాను స్థాపించిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని విలీనం చేశారు. బళ్లారిలో BJP బలపడటంలో ‘గాలి’ది కీలక పాత్ర. 2022లో BJP నుంచి వైదొలగి KRPP స్థాపించి MLAగా గెలిచారు. గాలి ఎఫెక్ట్ 2023 ఎన్నికల్లో కనిపించడంతో ఈ రీఎంట్రీతో BJPకి బలం చేకూరనుందని టాక్.
<<-se>>#Elections2024<<>>
Similar News
News March 18, 2026
కావ్యా.. కాల్ చెయ్: లలిత్ మోదీ

పాక్ బౌలర్ అబ్రార్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన <<19366541>>వివాదం<<>>లోకి IPL ఫౌండర్ లలిత్ మోదీ ఎంటర్ అయ్యారు. ‘ఫ్యాన్స్ ఆవేశంలో ఉన్న సమయంలో ఒక పాక్ ప్లేయర్‌పై ₹2.34 కోట్లు ఇన్వెస్ట్ చేయడమా? ప్రజాభిప్రాయాన్ని ఎలా మేనేజ్ చేయాలో, సామ్రాజ్యాలను ఎలా నిర్మించాలో నాకు బాగా తెలుసు. నాకు కాల్ చెయ్’ అంటూ పరోక్షంగా SRH ఓనర్ కావ్యా మారన్‌ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.
News March 18, 2026
₹2.40 లక్షలిస్తాం.. ఇండియాకు వెళ్లిపోండి: US

అక్రమ వలసదారులు తమ దేశం విడిచి వెళ్లాలని US మరోసారి కోరింది. చట్టవిరుద్ధంగా నివసిస్తున్నందుకు వేసిన ఫైన్స్‌ను రద్దు చేయడంతో పాటు ఫ్రీగా ఫ్లైట్ టికెట్లు అందజేస్తామని పేర్కొంది. అలాగే ₹2,40,329 ఎగ్జిట్ బోనస్ కింద ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలో అక్కడి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ప్రకటనతో పాటు తాజ్‌మహల్ ఫొటోను పోస్ట్ చేసి ‘Fly to India For Free’ అంటూ రాయడం చర్చనీయాంశమైంది.
News March 18, 2026
జనం సెక్సువల్ కంటెంట్ చూస్తున్నారు: రక్షిత

‘KD: ది డెవిల్’ సినిమాలోని ‘సర్కే చునర్’ పాట అసభ్యంగా ఉందన్న <<19406830>>విమర్శల<<>>పై డైరెక్టర్ ప్రేమ్ భార్య, మాజీ నటి రక్షిత స్పందించారు. గతంలో వచ్చిన ఈ తరహా పాటలకులేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం జనం రక్తపాతం, సెక్సువల్ కంటెంట్‌ను చూస్తున్నారని, కేవలం ఒక్క పాటతో తన భర్తను వ్యక్తిగతంగా దూషించడం సరికాదని మండిపడ్డారు. కన్నడ సినిమాలను థియేటర్లకు చేర్చడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలని కోరారు.


