News June 11, 2024
విమానాశ్రయాల ప్రాజెక్టులకు రెక్కలు!
AP: TDP MP రామ్మోహన్ నాయడు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కావడంతో రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులకు రెక్కలొచ్చాయి. విజయవాడ ఎయిర్‌పోర్ట్ సమీకృత టెర్మినల్‌ను త్వరగా పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడింది. విశాఖ సమీపంలోని భోగాపురం, నెల్లూరు(D) దగదర్తిలో ఎయిర్‌పోర్టులు నిర్మించాలని గతంలో చంద్రబాబు నిర్ణయించినా అధికారం కోల్పోవడంతో సాధ్యం కాలేదు. ఇప్పుడు వాటి ఏర్పాటుకు అవకాశం లభించింది.
Similar News
News December 25, 2024
తిరుమల మెట్లపై 12 అడుగుల కొండచిలువ.. భయంతో భక్తుల పరుగులు
సాధారణంగా చిన్నపామును చూస్తేనే భయంతో వణికిపోతాం. అలాంటిది 12 అడుగుల కొండచిలువను చూసి తిరుమల భక్తులు పరుగులు తీశారు. ఇవాళ మధ్యాహ్నం తిరుమల మెట్ల మార్గంలో పెద్ద కొండచిలువ భక్తుల కంటపడింది. దీంతో వెంటనే టీటీడీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి ఆ సర్పాన్ని సేఫ్‌గా అడవిలో వదిలిపెట్టారు. తిరుమలేశుడి నెలవైన శేషాచలం అడవుల్లో ఎన్నో జీవరాశులున్నాయి.
News December 25, 2024
నితీశ్, నవీన్‌కు భారతరత్న దక్కాలి: కేంద్రమంత్రి
భారతరత్న పురస్కారానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అర్హులని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘వారిద్దరూ తమ రాష్ట్రాల్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నారు. ప్రజలకు ఎంతో సేవ చేశారు. వారికి భారతరత్న వంటి అవార్డులు దక్కడం సముచితం. బిహార్‌లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నితీశ్ నేతృత్వంలో మళ్లీ ఎన్డీయే సర్కారే వస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
News December 25, 2024
రేపు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యే సినీ ప్రముఖులు వీరే!
TG: CM రేవంత్‌తో రేపు ఉ.10 గంటలకు సినీ ప్రముఖులు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భేటీ కానున్నారు. వీరిలో అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అరవింద్ కూడా ఉన్నారు. అలాగే చిరంజీవి, వెంకటేశ్, దిల్ రాజు తదితరులు పాల్గొంటారు. ప్రభుత్వం తరఫున మంత్రులు భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్, రాజనర్సింహ హాజరవుతారు. రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని CM ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.