News June 16, 2024
రాజకీయాల్లో గెలిస్తే పాలనలో సమర్థులన్నట్లు కాదు: KTR

TG: మన దేశంలో పొలిటికల్ సక్సెస్‌కి నీరు, విద్యుత్, రోడ్లు, ఉద్యోగాలు, నిత్యావసర వస్తువుల ధరలు వంటి సమస్యలను పరిష్కరించగల సామర్థ్యానికి సంబంధం లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్వీట్ చేశారు. ‘కల్పిత సమస్యల సాకుతో ఎన్నికల్లో గెలిచిన పార్టీలు ఈ సమస్యలను ఎలా పరిష్కరించగలవు?’ అని ప్రశ్నించారు. ఢిల్లీలో నెలకొన్న తీవ్ర నీటి సమస్యను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Similar News
News March 31, 2026
BREAKING: తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఉదయం <<19521864>>పెరిగిన<<>> బంగారం ధరలు సాయంత్రానికి తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 600 తగ్గి రూ.1,48,690, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.550 తగ్గి రూ.1,36,300 పలుకుతోంది. అటు కిలో వెండి రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.
News March 31, 2026
YouTubeలో ‘ధురంధర్-2’ కలకలం

బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ధురంధర్-2 మూవీ YouTubeలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. దీన్ని గమనించిన ఆ మూవీ ఫ్యాన్స్ SMలో పోస్టులు పెట్టారు. దీంతో అప్రమత్తమైన మూవీ టీమ్ పైరసీపై యూట్యూబ్‌ను సంప్రదించింది. వెంటనే స్పందించిన YouTube ఆ వీడియోను తొలగించింది. దీంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 19న రిలీజైన మూవీ రూ.1,300+కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
News March 31, 2026
సల్మాన్ సరసన నయన్.. బ్లాక్‌బస్టర్ కొడతారా?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో రానున్న సినిమాలో ఫిమేల్ లీడ్ కన్ఫర్మ్ అయింది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. SVC బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనుండగా వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభంకానుంది. నయన్ ఇప్పటికే షారుఖ్ ‘జవాన్’తో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో సల్మాన్ మూవీపై బజ్ పెరిగింది.


