News June 5, 2024
రాజకీయాల్లో గెలుపోటములు భాగం: మోదీ

రెండోసారి అధికారం ముగింపు సందర్భంగా నిర్వహించిన చివరి కేబినెట్ భేటీలో మంత్రులతో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు భాగమేనని, నంబర్స్ గేమ్ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఇన్నాళ్లు ప్రజలకు మంచి చేసిన మనం.. ఇకపైనా కొనసాగిద్దామన్నారు. 2019తో పోలిస్తే ఈసారి బీజేపీకి తక్కువ సీట్లు రావడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Similar News
News September 10, 2025
ఖతర్‌పై దాడిని ఖండించిన ప్రధాని మోదీ

ఖతర్ రాజధాని దోహాపై నిన్న ఇజ్రాయెల్ చేసిన <<17661181>>అటాక్‌ను<<>> PM మోదీ ఖండించారు. ‘ఖతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్‌తో మాట్లాడాను. సోదర దేశమైన ఖతర్ సార్వభౌమాధికారంపై దాడిని భారత్ ఖండిస్తోంది. ఘర్షణలకు తావులేకుండా చర్చలు, దౌత్యపరంగా సమస్యల పరిష్కారానికి మద్దతిస్తాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఖతర్‌లో శాంతి, స్థిరత్వానికి ఇండియా అండగా నిలబడుతుంది’ అని ట్వీట్ చేశారు. అయితే ఇజ్రాయెల్ పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం.
News September 10, 2025
అలనాటి రోజులను గుర్తు చేసిన హీరోయిన్

90ల్లో టాప్ హీరోయిన్గా మీనా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలు తగ్గించినా ఈ బ్యూటీ ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా సైమా అవార్డుల వేడుకలో ఆమె దిగిన ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. 48 ఏళ్లు వచ్చినా మీనా అందం ఏ మాత్రం తగ్గలేదని, ఆనాటి రోజులను గుర్తు చేస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆమె నటించిన సినిమాల్లో మీకు ఏది ఇష్టం? కామెంట్.
News September 10, 2025
ఫిజియోథెరపిస్టులు వైద్యులు కాదు: DGHS

ఫిజియోథెరపిస్టులు డాక్టర్స్ కాదని, వారి పేర్ల ముందు ‘Dr.’ అని పెట్టుకోవద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(DGHS) ఆదేశించింది. ఒకవేళ ‘Dr.’ ట్యాగ్ వాడితే అది చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ‘ఇలా చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించినట్లే. మెడికల్ ప్రాక్టీస్‌పై అవగాహన లేనందున ఫిజియోథెరపిస్టులు ప్రాథమిక చికిత్స చేయకూడదు. వైద్యులు రిఫర్ చేసిన పేషెంట్లనే ట్రీట్ చేయాలి’ అని పేర్కొంది.