News September 15, 2025
చలికాలం మరింత చల్లగా ఉండనుంది: నిపుణులు

అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లా నినా వల్ల చలి తీవ్రంగా ఉంటుంది అంటున్నారు. ఎల్ నినో దక్షిణ ఆసిలేషన్ సైకిల్‌లో శీతల దశైన లా నినా.. భూమధ్య రేఖ పసిఫిక్‌లో సముద్ర ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది అంటున్నారు. దాంతో వాతావరణంపై ప్రభావం ఉండనుంది. భారత్‌లో గతంలో కంటే చలి అధికంగా ఉంటుందని చెబుతున్నారు. తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News September 15, 2025
రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు!

AP: అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశముందని APSDMA తెలిపింది. ఇవాళ అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో మోస్తరు వానలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయంది.
News September 15, 2025
నేడు మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల

AP: ఇవాళ మెగా DSC తుది ఎంపిక జాబితా విడుదలకానుంది. అధికారిక వెబ్‌సైట్, జిల్లా విద్యాధికారి, కలెక్టర్ కార్యాలయాల్లోనూ రిజల్ట్ అందుబాటులో ఉంచనున్నారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులకుగానూ జూన్ 6 నుంచి జులై 2 వరకు రెండు విడతలుగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. జులై 5న ప్రాథమిక కీ, ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదలైంది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తైంది. ఈనెల 19న అమరావతిలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు.
News September 15, 2025
నేటి నుంచి ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్

TG: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఇవాళ ప్రారంభంకానుంది. ఈరోజు రిజిస్ట్రేషన్స్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ఉంటుంది. రేపు స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు. 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్స్, 20న సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాల కోసం WWW.TGICET.NIC.INను సందర్శించండి.