News August 19, 2025

వైర్లు కట్.. కేబుల్ ఆపరేటర్ల ఆందోళన

image

హైదరాబాద్‌లోని TGSPDCL కార్యాలయం ఎదుట కేబుల్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. రామంతాపూర్ ఘటనకు <<17452500>>కేబుల్<<>> వైర్లు కారణం కాదని, వాటిలో విద్యుత్ సరఫరా అవ్వదని తెలిపారు. వైర్లు తొలగిస్తే లక్షలమంది ఉపాధి కోల్పోతారని, వర్క్ ఫ్రమ్ హోం చేసే వాళ్లు ఇబ్బంది పడతారని వెల్లడించారు. కేబుల్ వైర్లను కట్ చేయొద్దని డిమాండ్ చేశారు.

Similar News

News August 19, 2025

‘ఇంకాసేపే’ అనుకొంటూ రీల్స్ చూస్తున్నారా?

image

‘ఇంకాసేపే’ అని రీల్స్ చూస్తాం.. కానీ అది గంటల సమయాన్ని మింగేస్తుంది. అతిగా రీల్స్, షార్ట్స్ చూడటం ప్రమాదమని టియాంజిన్ నార్మల్ యూనివర్సిటీ(చైనా) తేల్చింది. ఇది మద్యం సేవించడం కంటే 5రెట్లు దుష్ప్రభావాలను చూపుతుందని పేర్కొంది. మెదడు సున్నితత్వాన్ని కోల్పోయి రోజూవారి కార్యకలాపాలను ఆనందించే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తుందట. స్థిరమైన ఆలోచన నుంచి మనల్ని తక్షణ సంతృప్తి వైపు మళ్లిస్తుందని తేల్చింది.

News August 19, 2025

రైళ్లలో లగేజ్ వెయిట్ రూల్స్.. త్వరలో అమలు!

image

రైల్వే శాఖ ఎయిర్‌పోర్ట్ తరహా లగేజ్ వెయిట్ రూల్స్‌ను త్వరలో తీసుకురానుంది. ఫస్ట్ AC కంపార్ట్‌మెంట్‌లో 70కేజీలు, సెకండ్ AC 50 KG, థర్డ్ AC/స్లీపర్ 40 KG, జనరల్/2S 35 KG వరకు తీసుకెళ్లొచ్చు. పరిమితికి మించి తీసుకెళ్లాలంటే ముందే బుకింగ్ చేసుకోవాలి. లేదంటే జరిమానా విధిస్తారు. సైజు విషయంలోనూ పరిమితులుంటాయి. ఈ రూల్స్ తొలుత నార్తర్న్, నార్తర్న్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఎంపిక చేసిన 11 స్టేషన్లలో అమలవుతాయి.

News August 19, 2025

NEET(PG) ఫలితాలు విడుదల

image

నీట్(పీజీ)-2025 ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(NBEMS) రిలీజ్ చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇక్కడ <>క్లిక్<<>> చేసి తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. MD, MS, PG డిప్లొమా ప్రోగ్రాముల్లో చేరేందుకు ఈ పరీక్ష నిర్వహించారు. జనరల్ అభ్యర్థులకు 276/800 మార్కులు కటాఫ్‌ కాగా జనరల్ PwD అభ్యర్థులకు 255.. SC, ST, OBC క్యాండిడేట్లకు 235 మార్కులుగా నిర్ణయించారు.