News May 24, 2024

SRHలో అతడు ఉంటే బాగుండేది: ఫ్యాన్స్

image

IPL: RRతో మ్యాచులో మార్క్రమ్ విఫలం కావడంతో న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిలిప్స్ పేరు Xలో ట్రెండ్ అవుతోంది. ఈ సీజన్లో ఫిలిప్స్‌కు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని, కనీసం ఇవాళైనా ఆడించి ఉంటే బాగుండేదని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. మార్క్రమ్ గత మ్యాచుల్లో విఫలమైనా జట్టులోకి తీసుకున్నారని, ఫిలిప్స్‌ను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.

Similar News

News October 20, 2025

జుట్టు పెరగాలంటే హెయిర్ కట్ తప్పనిసరా?

image

జుట్టును కొద్దిగా కత్తిరించుకుంటే వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ జుట్టు పెరగడానికి హెయిర్‌కట్‌కి సంబంధం లేదంటున్నారు నిపుణులు. కానీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి చివర్లు కత్తిరించడం మంచిదని సూచిస్తున్నారు. స్ప్లిట్ ఎండ్స్ వల్ల జుట్టు నిర్జీవంగా, గడ్డిలా తయారవుతుంది. కాబట్టి 3-4 నెలలకోసారి చివర్లు కత్తిరిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. <<-se>>#Haircare<<>>

News October 20, 2025

అరటిలో మాంగనీసు ధాతు లోపం – నివారణ

image

అరటి తోటలో మాంగనీసు ధాతులోపం వల్ల ముదురు ఆకులపై నిర్ణీత ఆకారం లేని పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగు మచ్చ మధ్యలో ఎండిపోతుంది. మాంగనీసు ధాతులోపం తీవ్రమైతే ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. పిలకల లేత ఆకులు, ఆకుమచ్చ చారలతో తెల్లగా మారి లోపం తీవ్రమైనప్పుడు ఎండిపోతాయి. లోప నివారణకు లీటరు నీటికి మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు కలిపి ఆకులన్నీ తడిచేలా 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.

News October 20, 2025

బిహార్ తొలి విడత ఎన్నికలకు ముందు పీఎం కిసాన్ నిధులు విడుదల?

image

దీపావళి సందర్భంగా కేంద్రం PM కిసాన్ 21వ విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని వార్తలు వచ్చినా మోదీ సర్కార్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే నవంబర్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా రైతులకు రూ.2వేల చొప్పున జమ చేసే అవకాశం ఉందని నేషనల్ మీడియా పేర్కొంది. బిహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలకు (నవంబర్ 6) ముందు కేంద్రం దీనిపై ప్రకటన చేయవచ్చని తెలిపింది. ఈ-కేవైసీ పూర్తి కాని రైతులకు డబ్బులు జమ కావని వివరించింది.