News September 17, 2024
ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల విషెస్

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ నిత్యం దేశ సేవలో తరిస్తూ మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా. ఆయన దార్శనిక నాయకత్వంలో మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉండాలి’ అని బాబు ఆకాంక్షించారు. ‘మన దేశాన్ని పురోగతి, శ్రేయస్సు వైపు నడిపించేలా ఆయనకు మంచి ఆరోగ్యం, ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా’ అని రేవంత్ పేర్కొన్నారు.
Similar News
News February 22, 2026
హోం క్లీనింగ్ టిప్స్

* కత్తెర మొద్దుబారినప్పుడు అల్యూమినియం ఫాయిల్ ను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తే పదునెక్కుతుంది. * మొక్కజొన్న పిండికి కొంచెం నీళ్ళు కలిపి పేస్టు చేసుకొని అద్దాలకు పట్టించి పొడి వస్త్రంతో తుడవాలి. * కంప్యూటర్ కీ బోర్డు, మౌస్ పై మరకలు పడితే వెనిగర్‌లో ముంచిన వస్త్రంతో శుభ్రం చేయాలి. దీనివల్ల సూక్ష్మక్రిములూ నశిస్తాయి. * వెండి వస్తువులను సహజ సిద్ధ గోరింటాకులో నానబెట్టి శుభ్రపరిస్తే తళతళలాడతాయి.
News February 22, 2026
సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

చెన్నైలోని CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 3 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి M.Tech(ఫుట్‌వేర్ Engg.&మేనేజ్‌మెంట్, MSc (బయోటెక్నాలజీ/బయోసైన్స్/బయోకెమిస్ట్రీ) అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 16న రాత పరీక్ష, 18న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. NET/GATE అర్హత కలిగినవారు రాత పరీక్షకు హాజరుకానవసరం లేదు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: clri.org/
News February 22, 2026
11 సార్లు రామాయణాన్ని వీక్షించిన మహర్షి

కాకి ముఖం, మానవ శరీరంతో ఉండే కాగ్భుషుండి మహర్షి రామాయణాన్ని 11 సార్లు, భారతాన్ని 16 సార్లు వీక్షించారని పురాణాల వాక్కు. లోమశ మహర్షి శాపంతో ఈ రూపం పొందారట. రాముడిపై భక్తితో చిరంజీవిగా నిలిచారని చెబుతారు. జ్ఞాన సముపార్జనలో రూపం ముఖ్యం కాదని, అహంకారాన్ని వీడి రామనామాన్ని జపించడమే పరమార్థమని ఆయన వశిష్ఠ మహర్షికే బోధించారు. గరుత్మంతుడి సందేహాలను నివృత్తి చేస్తూ రామాయణ రహస్యాలను వివరించిన జ్ఞాని ఈయన.


