News June 24, 2024
నిన్న కవితకు విషెస్.. కాసేపటికే BRSకు MLA గుడ్‌బై

TG: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నిన్న BRSను వీడి కాంగ్రెస్‌లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఈక్రమంలో BRS శ్రేణులు ఆయనపై విమర్శలకు దిగాయి. ఆయన గెలుపుకోసం MLC కవిత ఎంతో శ్రమించారని గుర్తుచేస్తున్నారు. నిన్న కవిత వివాహ వార్షికోత్సవం కావడంతో ‘మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అనిల్ బావకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అని సంజయ్ చేసిన ట్వీట్ వైరలవుతోంది.
Similar News
News December 6, 2025
‘RO-KO’ని దాటేసిన వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచారు. 2025లో మోస్ట్ సెర్చ్డ్ క్రికెటర్ ఇన్ ఇండియా లిస్ట్‌లో టాప్ ప్లేస్ సాధించారు. ఐపీఎల్‌తో ఈ యంగ్‌స్టర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. రెండో స్థానంలో ప్రియాన్ష్ ఆర్య, మూడో స్థానంలో అభిషేక్ శర్మ, షేక్ రషీద్ నాలుగో స్థానం, జెమీమా రోడ్రిగ్స్ ఐదో స్థానంలో నిలిచారు. IPL 2025, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ బజ్ ఉన్నా రోహిత్, కోహ్లీ ఈ లిస్టులో పేర్లు సాధించలేకపోయారు.
News December 6, 2025
‘X’కు $140 మిలియన్ డాలర్ల ఫైన్

యూరోపియన్ యూనియన్ ‘X’ అధినేత ఎలాన్ మస్క్‌కు షాకిచ్చింది. తమ దేశంలోని ఆన్లైన్ కంటెంట్ రూల్స్‌ను మస్క్ ప్లాట్‌ఫామ్ ఉల్లంఘించిందని EU టెక్ రెగ్యులేటర్స్ ఆరోపించింది. అందుకు 120($140 మిలియన్స్) మిలియన్ యూరోస్ ఫైన్ విధించింది. దీనిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖండించారు. “ఇది కేవలం ‘X’ మీదే కాదు అమెరికా టెక్ ప్లాట్‌ఫామ్స్, US పౌరులపై విదేశీ ప్రభుత్వాల దాడి” అని ట్వీట్ చేశారు.
News December 6, 2025
డిసెంబర్ 6: చరిత్రలో ఈ రోజు

1935: సినీ నటి సావిత్రి జననం
1985: భారత క్రికెటర్ ఆర్.పి.సింగ్ జననం
1988: భారత క్రికెటర్ రవీంద్ర జడేజా జననం
1993: భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా జననం
1991: భారత క్రికెటర్ కరుణ్ నాయర్ జననం
1994: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ జననం
1956: భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ మరణం


