News October 11, 2024

జేసీ ప్రభాకర్‌తో నాకు ప్రాణహాని: కేతిరెడ్డి

image

AP: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ‘2006లో మా అన్న సూర్యప్రతాప్‌ను చంపారు. నన్నూ అలాగే హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఎస్పీ జగదీశ్ సహకరిస్తున్నారు. ప్రస్తుతం నాపై మూడు మర్డర్ కేసులు నమోదు చేశారు. నియోజకవర్గంలో జేసీ ముఠా ఆగడాలు ఎక్కువయ్యాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News April 4, 2026

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధానికి బాధితుల లేఖ

image

గతేడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులు 30 మంది ప్రధాని మోదీకి లేఖ రాశారు. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ ఫ్లైట్ డేటా రికార్డర్ డేటాను విడుదల చేయాలని కోరారు. బహిరంగంగా కుదరకపోతే తమకైనా ఆ వివరాలు ఇవ్వాలన్నారు. విమానం ఎందుకు కూలిందో తాము తెలుసుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఫ్లైట్‌లోని 242 మందికి గాను 241 మంది, 19 మంది ఇతరులు మరణించిన విషయం తెలిసిందే.

News April 4, 2026

రేపే ఉప్పల్‌లో మ్యాచ్.. వీటిపై నిషేధం

image

రేపు 3.30PMకు ఉప్పల్‌లో SRH, LSG తలపడనున్నాయి. స్టేడియం వద్ద క్లాక్‌రూమ్ ఉండదని, నిషేధిత వస్తువులు తీసుకురావొద్దని పోలీసులు సూచించారు.
వీటిపై నిషేధం: ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, హ్యాండ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్స్, హెల్మెట్లు, ఇయర్ పాడ్స్, కీ చైన్లు, పెన్నులు, పదునైన వస్తువులు, ఆయుధాలు, వాటర్ బాటిళ్లు, చిరుతిళ్లు, అగ్గిపెట్టెలు, సిగరెట్లు, లైటర్లు, బ్యానర్లు.

News April 4, 2026

ప్రభాస్ ‘ఫౌజీ’ ఫొటోలు లీక్.. మేకర్స్ వార్నింగ్

image

హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్‌కు సంబంధించి లీకైన కొన్ని ఫొటోలు వైరలవుతున్నాయి. దీనిపై మేకర్స్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి కంటెంట్‌పై రిపోర్ట్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ ఫొటోలను షేర్ చేయొద్దని సూచించారు. ఇలాంటి లీకుల వల్ల సినిమా నిర్మాణంపై ప్రభావం పడుతుందన్నారు. సిల్వర్ స్క్రీన్‌పై మూవీని చూస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పారు.