News June 28, 2024

జగన్ విధ్వంసంతో పోలవరం భౌగోళిక పరిస్థితులు మారాయి: సీఎం చంద్రబాబు

image

AP: కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చవుతుందని, రెండు సీజన్ల సమయం పడుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. కాఫర్ డ్యామ్ లీకేజీ వల్ల ఏ పనులూ చేసే పరిస్థితి లేదన్నారు. ‘జగన్ విధ్వంసంతో ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులు మారాయి. రూ.80 కోట్లతో నిర్మించిన గైడ్‌బండ్ వైసీపీ ప్రభుత్వ అసమర్థతతో కుంగిపోయింది. పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారు. నిర్మాణ ఖర్చు 38 శాతం పెరిగింది’ అని ఆరోపించారు.

Similar News

News December 12, 2025

చిన్నస్వామిలో IPL మ్యాచ్‌లకు లైన్ క్లియర్!

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ IPL మ్యాచ్‌లు నిర్వహించేందుకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. జస్టిస్‌ డీకున్హా కమిషన్‌ సూచించిన భద్రతా సిఫార్సులు అమలు చేస్తే మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక క్యాబినెట్‌ నిర్ణయించింది. తొక్కిసలాట ఘటన అనంతరం స్టేడియం భద్రతాపరంగా అనుకూలం కాదని నివేదిక తేల్చడంతో పెద్ద ఈవెంట్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం స్టేడియం పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు.

News December 12, 2025

ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

image

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు

News December 12, 2025

అఖండ-2.. AICCకి షర్మిల ఫిర్యాదు!

image

అఖండ-2 టికెట్ ధరల పెంపు <<18532497>>వివాదం<<>> ఢిల్లీని తాకినట్లు తెలుస్తోంది. CM చంద్రబాబు చెబితేనే CM రేవంత్ రేట్లు పెంచారంటూ APCC చీఫ్ షర్మిల AICCకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాము CBNకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆయన చెప్పింది చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇదే విషయమై INC పెద్దలు ఆరా తీసి TG ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు టాక్. దీంతో ఇకపై టికెట్ ధరలు పెంచబోమంటూ మంత్రి కోమటిరెడ్డి <<18543073>>ప్రకటించినట్లు<<>> సమాచారం.