News August 28, 2024
డెబిట్ కార్డు లేకున్నా డబ్బులు విత్ డ్రా

కొంతమంది ATMకు డెబిట్ కార్డు తీసుకెళ్లడం మర్చిపోతారు. కానీ డెబిట్ కార్డు లేకుండానే మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం మీ మొబైల్లో UPI యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ATM స్క్రీన్‌పై ‘యూపీఐ విత్‌డ్రాయల్స్’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత ఫోన్లోని యూపీఐ యాప్ ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. అనంతరం ఎంత కావాలో ఎంటర్ చేసి యూపీఐ పిన్ ప్రెస్ చేస్తే మనీ వస్తుంది.
Similar News
News November 23, 2025
పోలీసులకు సవాల్ విసురుతున్న MovieRulz

పైరసీ మాఫియా టాలీవుడ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. iBOMMA, Bappam TV లాంటి సైట్లు బ్లాక్ చేసినా, MovieRulz మాత్రం తన దారులు మార్చుకుంటూ కొనసాగుతోంది. శుక్రవారం విడుదలైన సినిమాలు ఒక్కరోజు కూడా గడవక ముందే మూవీ రూల్జ్‌లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్లో కెమెరాతో రికార్డ్ చేసిన ప్రింట్లను అప్లోడ్ చేశారు. ఇప్పటికే iBOMMA రవిపై పోలీసులు విచారణను వేగవంతం చేసినప్పటికీ MovieRulz మాత్రం సవాల్ విసురుతోంది.
News November 23, 2025
నాగచైతన్య కొత్త మూవీ టైటిల్ వచ్చేసింది

అక్కినేని నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రివీల్ చేశారు. ‘వృషకర్మ’ టైటిల్‌తో నాగచైతన్య యాంగ్రీ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను Xలో పోస్ట్ చేశారు. చైతూకి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ సాలిడ్‌గా ఉందని మహేశ్ పేర్కొన్నారు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్గా నటిస్తున్నారు.
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


