News November 23, 2024

ఎదురుదెబ్బలను తట్టుకుని పీఠమెక్కారు

image

ఎగ్జిట్‌పోల్స్, విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ, అనేక ఎదురుదెబ్బలను తట్టుకుని ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని JMM మరోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఏడాదిలో తాను అరెస్టవడం, తర్వాత కీలక నేత చంపై సోరెన్, వదిన సీత కమలం గూటికి చేరినా ఆయన తగ్గలేదు. భార్య కల్పనతో కలిసి సుడిగాలి పర్యటనలు చేశారు. తనపై బీజేపీ చేసిన తీవ్ర ఆరోపణలను ఎండగడుతూనే ప్రజాకర్షక పథకాలతో ఓటర్ల మనసు గెలిచారు.

Similar News

News December 11, 2025

ఇచ్చోడ: లక్కీ డ్రాతో సర్పంచ్ ఎన్నిక

image

ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా, పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 176 ఓట్లు వచ్చాయి. దీంతో లక్కీ డ్రా ద్వారా ఈశ్వర్‌ను సర్పంచ్‌గా ప్రకటించారు. ఈ విధంగా లక్కీ డ్రా ద్వారా విజేత ఎన్నికవడం ఉత్కంఠను రేపింది.

News December 11, 2025

సూపర్ నేపియర్ గడ్డి పెంపకానికి సూచనలు

image

పశుగ్రాసం కొరతను తగ్గించి, పాడి పశువులకు ఎక్కువ పోషకాలను అందించే గడ్డి సూపర్ నేపియర్. దీన్ని చౌడు నేలలు మినహా ఆరుతడి కలిగిన అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. దీని సాగుకు ముందు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్పేట్, 20kgల నత్రజని, 10kgల పొటాష్ వేయాలి. భూమిని మెత్తగా దున్ని, ప్రతీ 3 అడుగులకొక బోదెను ఏర్పాటు చేసి, ఎకరాకు 10 వేల కాండపు కణుపులు లేదా వేరు పిలకలు నాటుకోవాలి.

News December 11, 2025

సెన్సార్ బోర్డుపై నటుడి కామెంట్స్.. సారీ చెప్పిన మేకర్స్

image

‘మోగ్లీ’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విలన్ పాత్రలో నటించిన బండి సరోజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన పర్ఫార్మెన్స్ చూసి సెన్సార్ బోర్డు అధికారి భయపడటంతోనే ‘A’ సర్టిఫికెట్ వచ్చిందని ఆయన కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నిర్మాణసంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ X వేదికగా స్పందించింది. నటుడు నోరు జారడంపై సెన్సార్ బోర్డుకు క్షమాపణలు చెబుతూ, ఆ ఫుటేజీని తొలగిస్తామని ప్రకటించింది. అటు సరోజ్ కూడా సారీ చెప్పారు.