News April 11, 2025

WNP:ఆస్తి పన్ను చెల్లించే వారికి 5% తగ్గింపు

image

వనపర్తి : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను చెల్లించే వారికి 5% తగ్గింపుతో ప్రభుత్వం కల్పించిన రిబేట్ అవకాశం ప్రయోజనాల గురించి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

Similar News

News February 9, 2026

కరీంనగర్: కులం.. గుణం.. ఓటు ఎటు?

image

ఉమ్మడి KNR జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. ప్రచారానికి గడువు ముగుస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం వంటి నినాదాలు పైకి వినిపిస్తున్నా, లోలోపల మాత్రం కులాల వారీగా ఓట్ల లెక్కలు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేలా కనిపిస్తున్నాయి. చివరకు అభివృద్ధి మంత్రం గెలుస్తుందా? లేక సామాజిక వర్గాల సమీకరణాలు గట్టెక్కిస్తాయా? చూడాలి.

News February 9, 2026

NLG: ఎంఈఓలూ.. ఏమిటి నిర్లక్ష్యం!?

image

జిల్లాలో ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడంలో జిల్లా విద్యాశాఖ విఫలమైంది. మొత్తం 3,122 దరఖాస్తుల్లో 2,320 మాత్రమే ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయగా, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయి. చింతపల్లి, చందంపేట, తిప్పర్తి, పెద్దవూర, DVK, CTL, గట్టుప్పల్, NKL తదితర మండలాల్లో రిజిస్ట్రేషన్ శాతం 55.5 నుంచి 88.2 మధ్యలోనే ఉన్నాయి. దీనిపై కలెక్టర్ ఎంఈఓలకు షోకాజ్ నోటీసులు అందజేశారు.

News February 9, 2026

చెన్నూరు: చుక్కల దుప్పిని చంపిన ఐదుగురికి రిమాండ్

image

మంచిర్యాల జిల్లా సంకారం అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిని చంపిన కేసులో ఐదుగురు నిందితులకు చెన్నూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎఫ్డీఓ సర్వేశ్వర్ వివరాల ప్రకారం.. ఈనెల 4న నిందితులు విద్యుత్ వైర్లు అమర్చి దుప్పిని వేటాడారు. వన్యప్రాణిని హతమార్చినందుకు వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రవి విచారించి రిమాండ్‌కు తరలించాలని ఆదేశించారు.