News March 13, 2025
WNP: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు

వీపనగండ్ల మండలంలో 18 రోజులక్రితం అదృశ్యమైన వ్యక్తి శవమై తేలిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. మండలానికి చెందిన వీరస్వామి(35) గత నెల23న శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరాడు. కొంత దూరం నడిచాక తాను నడవలేనని, ఇంటికెళ్లిపోతానని వెనుదిరిగాడు. కానీ ఇంటికి చేరలేదు. సంత్రావుపల్లి గ్రామశివారులో మృతిచెంది కనిపించాడు. ఆధార్‌కార్డు వివరాల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారమందించారు. ఈ మేరకు కేసునమోదైంది.
Similar News
News November 5, 2025
కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు సూచనలు: అనగాని

AP: కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు పలు వర్గాల నుంచి సూచనలు వచ్చాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల కోసమూ వినతులు అందినట్లు చెప్పారు. పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే వీటిపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. CM సూచనతో అల్లూరి(D)లో ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటుపై ఆలోచనలు చేస్తున్నామన్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అక్రమాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 5, 2025
జగిత్యాల: తల్లిదండ్రుల గెంటివేత.. కొడుకులకు కౌన్సిలింగ్

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వృద్ధ దంపతులు కంచెటి నారాయణ, నర్సమ్మను వారి కొడుకులు మంగళవారం ఇంటి నుంచి బయటకు గెంటేశారు. వారు సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్‌ను ఆశ్రయించారు. ఆయన రాత్రి వారికి ఆశ్రయం కల్పించి, బుధవారం కుమారులు, కోడళ్లకు కౌన్సిలింగ్‌కు పిలిపించారు. కౌన్సిలింగ్ అనంతరం పిల్లలు క్షమాపణ చెప్పి, సమ్మతి పత్రం ఇచ్చి తల్లిదండ్రులను ఇంటికి తీసుకెళ్లారు.
News November 5, 2025
ANU: బీటెక్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత జులై నెలలో జరిగిన బీటెక్ ll, lV ఇయర్స్ ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు బుధవారం విడుదల చేశారు. 179 మందికి గాను 100 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందినట్లు తెలిపారు. రీవాల్యుయేషన్‌కు ఈ నెల 17వ తేదీ లోపు రూ. 2,070 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.


