News March 13, 2025

WNP: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు

image

వీపనగండ్ల మండలంలో 18 రోజులక్రితం అదృశ్యమైన వ్యక్తి శవమై తేలిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. మండలానికి చెందిన వీరస్వామి(35) గత నెల23న శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరాడు. కొంత దూరం నడిచాక తాను నడవలేనని, ఇంటికెళ్లిపోతానని వెనుదిరిగాడు. కానీ ఇంటికి చేరలేదు. సంత్రావుపల్లి గ్రామశివారులో మృతిచెంది కనిపించాడు. ఆధార్‌కార్డు వివరాల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారమందించారు. ఈ మేరకు కేసునమోదైంది.

Similar News

News March 9, 2026

కేయూ హాస్టళ్లకు మెస్ సరఫరాల టెండర్లు

image

హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లకు 2026- 27 సంవత్సరానికి అవసరమైన మెస్ సరఫరాల కోసం టెండర్లు ఆహ్వానించారు. కిరాణా సరుకులు, కుకింగ్ ఆయిల్, గుడ్లు, చికెన్, బియ్యం, కూరగాయలు, పాలు, పెరుగు, గ్యాస్ తదితర సరఫరాల కోసం అనుభవం ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల సంస్థలు మార్చి 20 సాయంత్రం 5 గంటలలోపు సీల్డ్ టెండర్లు సమర్పించాలని యూనివర్సిటీ హాస్టల్ డైరెక్టర్ తెలిపారు.

News March 9, 2026

నిర్మల్: మరింత వేగవంతమైన పోలీస్ సేవలు: ఎస్పీ

image

నిర్మల్ పట్టణ ప్రజలకు మరింత వేగవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు నిర్మల్ పట్టణంలో కొత్తగా నిర్మల్ టౌన్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతంగా పోలీస్ సేవలు అందించేందుకు, కేసులు, ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించేందుకు నిర్మల్ టౌన్ ఔట్ పోస్ట్‌ను పాత భరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

News March 9, 2026

కదిరి తేరు చూతము రారండి

image

రాష్ట్రంలోనే అతిపెద్ద రథంగా ప్రసిద్ధి చెందిన కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం <<19334504>>(తేరు)<<>> రేపు జరగనుంది. 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు గల ఈ భారీ రథంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. టీటీడీ సహకారంతో మూడేళ్ల క్రితం నూతన చక్రాలను అమర్చిన ఈ రథంపై 256 అద్భుత శిల్ప కళాకృతులు ఉన్నాయి. దేశంలోనే మూడో అతిపెద్దదైన ఈ తేరును లాగేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.