News March 2, 2025
WNP: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో కేఎల్ఐ కాల్వలో వ్యక్తి మృతిచెందటం వనపర్తి జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసుల వివరాలిలా.. పాన్‌గల్‌కి చెందిన రహ్మతుల్లా(44) మటన్ కొడుతూ జీవిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి పొట్టేలు కోసేది ఉందని అతడిని తీసుకెళ్లాడు. ఉదయం 7.30 గంటలకు రహ్మతుల్లా శవమై కాల్వలో కనిపించాడు. ఈ మేరకు కేసు నమోదైంది. పోలీసులు మృతుడి భార్యను విచారిస్తున్నారు.
Similar News
News July 6, 2025
ఎన్టీఆర్: పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ, LLM 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ANU విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.
News July 6, 2025
ప్రచార రథం ప్రారంభమయ్యేది అప్పుడే

జులై 9న మ.2 గంటలకు సింహాచలం గిరిప్రదక్షిణ ప్రచారరథం ప్రారంభమవుతుందని ఈవో త్రినాథరావు కలెక్టర్‌కు వివరించారు. తొలిపావంచా వద్ద అశోక్ గజపతి చేతుల మీదుగా ప్రచారరథం ప్రారంభమవుతుందన్నారు. ఆరోజు రాత్రి 11 గంటలకు రథం ఆలయానికి చేరుకుంటుందని, మరుసటి రోజు ఉ.5 నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.10వ తేదీ సాయంత్రం 7వరకు దర్శనాలు ఉంటాయన్నారు.
News July 6, 2025
ఈనెల 10న మెగా పేరెంట్ మీట్: కలెక్టర్

జిల్లాలని అన్ని పాఠశాలల్లో ఈనెల 10న మెగా పేరెంట్ మీట్ నిర్వహించాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఉన్న 1385 పాఠశాలల్లో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో హాజరవ్వాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పథకంలో అతిథిలకు స్కూల్లోనే భోజనం అందించాలన్నారు 212 జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలన్నారు.