News February 23, 2025

WNP: ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు: కలెక్టర్

image

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. జిల్లాలో 12 ఇసుక రీచ్‌లు ఉన్నాయని అన్నారు. జిల్లాలో ఇసుక అవసరం ఉన్న వారు మన ఇసుక వాహనం ద్వారానే తీసుకోవాలని దళారులను ఎవరూ ఆశ్రయించొద్దని సూచించారు. ఇసుకకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఐడీఓసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం 08545-233525కు కాల్ చేసి తెలపాలని అన్నారు.

Similar News

News December 13, 2025

ఈ వాతావరణం కనకాంబరం సాగుకు అనుకూలం

image

అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు కనకాంబరం సాగుకు అనుకూలం. మొక్క పెరుగుదలకు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండాలి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూల దిగుబడి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను కూడా మొక్క తట్టుకోలేదు. నీరు నిలవని అన్ని రకాల నేలలు, ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉన్న నేలల్లో మంచి దిగుబడి వస్తుంది.

News December 13, 2025

WGL: డబ్బులు అడిగిన విలేకరులను చితకబాదిన నేతలు!

image

వరంగల్ శివారులో రెండో విడత ప్రచారానికి కవరేజ్‌కు వెళ్లిన ఇద్దరు మీడియా కంట్రిబ్యూటర్లు ప్రచారం ముగిసిన అనంతరం మామూళ్లు అడిగినట్టు ఆరోపణలు వచ్చాయి. డబ్బుల విషయంలో వివాదం చెలరేగగా, ఆగ్రహించిన పార్టీ శ్రేణులు మీడియా ప్రతినిధుల ఫోన్లు లాక్కొని తరిమినట్లు సమాచారం. గ్రామశివారు వరకు వెంబడించి దాడి చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అనంతరం వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా ఓ MLA ఆదేశాలతో ఇరుపక్షాలు రాజీ పడ్డాయి.

News December 13, 2025

సంతబొమ్మాళి: రాకాసి అలలు..ప్రాణాలు తీశాయి

image

చేపల వేటకెళ్లిన మత్స్యకారుడు మృతి చెందిన ఘటన సంతబొమ్మాళి(M) భావనపాడులో శనివారం ఉదయం జరిగింది. తోటి జాలర్లతో వేటకెళ్లిన రాజయ్య(60) బలమైన కెరటాలకు తెప్ప నుంచి ప్రమాదవశాత్తూ సముద్రంలోకి పడిపోయాడు. పక్కనే ఉన్నవారు అప్రమత్తమై కాపాడేలోపే రాకాసి అలల తాకిడికి తనువు చాలించాడు. అనంతరం డెడ్ బాడీని ఒడ్డుకు తీసుకురాగా..సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.