News February 12, 2025
WNP: చనిపోయేందుకు శ్రీశైలం వచ్చిన యువతి.. కాపాడిన పోలీసులు

ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చిన ఓ యువతిని స్థానిక పోలీసులు కాపాడారు. సీఐ ప్రసాదరావు వివరాల మేరకు.. వనపర్తి జిల్లా ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చింది. పాతాళగంగ వద్ద తిరుగుతున్న ఆమెను పోలీస్ సిబ్బంది గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. వారి బంధువులకు క్షేమంగా అప్పగించామని సీఐ తెలిపారు. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో తెలియరాలేదని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
నాగిరెడ్డిపేట: MPDO, MPO సస్పెండ్

నాగిరెడ్డిపేట MPDO లలిత కుమారి, MPO ప్రభాకర్ చారీలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సస్పెండ్ చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించడం, సమయానుగుణంగా అధికారులకు వివరాలను అందించడంలో అలసత్వంగా వ్యవహరించడంతో జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా తమ ఇష్టానుసారంగా వెళ్లడంతో వేటు వేసింది. పంచాయతీ ఎన్నికలను అధికారులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.
News December 4, 2025
భారీ జీతంతో ఉద్యోగాలు

తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ (<
News December 4, 2025
అంతర్గంలో ఎయిర్పోర్టు స్థల పరిశీలన

స్థల పరిశీలన చేసేందుకు ఎయిర్పోర్టు అథారిటీ అధికారులు రామగుండం గురువారం వచ్చారు. వివిధ శాఖల అధికారులతో కలిసి అంతర్గాంలో స్థల పరిశీలన చేశారు. కాగా ఇటీవల రామగుండం ఎయిర్ పోర్టుకు సంబంధించి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు.


