News February 12, 2025

WNP: చనిపోయేందుకు శ్రీశైలం వచ్చిన యువతి.. కాపాడిన పోలీసులు

image

ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చిన ఓ యువతిని స్థానిక పోలీసులు కాపాడారు. సీఐ ప్రసాదరావు వివరాల మేరకు.. వనపర్తి జిల్లా ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చింది. పాతాళగంగ వద్ద తిరుగుతున్న ఆమెను పోలీస్ సిబ్బంది గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. వారి బంధువులకు క్షేమంగా అప్పగించామని సీఐ తెలిపారు. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో తెలియరాలేదని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 25, 2025

భీమదేవరపల్లి: తెల్లవారుజామున యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

భీమదేవరపల్లి మండలం ముల్కనూర్- ఎల్కతుర్తి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కనకపూడి కర్ణాకర్ అనే పాస్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 25, 2025

బాపట్ల: ‘నా కొడుకు చంపాలని చూస్తున్నాడు’

image

ఆస్తిరాయించుకొని తన కొడుకు తనను చంపాలనుకుంటున్నాడని సయ్యద్ కరిమూన్, బొప్పుడి బాపట్ల SP వద్ద వాపోయారు. ‘నాకు ఇద్దరు మగపిల్లలు, ఒకమ్మాయి. పెద్ద కొడుకు చనిపోయాడు. నా చిన్నకొడుకు సయ్యద్ మోహిద్దీన్, కోడలు నజీమూన్‌లు ఆస్తీ మొత్తం తీసుకుని నన్ను, నా భర్తను చంపాలని చూశారు. దీంతో నాభర్త భయంతో పారిపోయాడు. నేను ప్రాణభయంతో వేటపాలెంలోని నా కూతరు వద్ద ఉన్నా, నన్ను కాపాడండి’ అని వేడుకున్నారు.

News March 25, 2025

ఒంగోలు: యువకుల ఫోన్ల తనిఖీ

image

IPL బెట్టింగ్‌తో పాటు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈక్రమంలో పోలీసులు నిఘా పెంచారు. ఒంగోలు బస్టాండ్ వద్ద డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు యువకుల ఫోన్లు చెక్ చేశారు. బెట్టింగ్ యాప్స్, సింగిల్ నంబర్ వాడే వారిని గుర్తించారు. 300 మంది అనుమానితులను తనిఖీ చేసి రూ.5,500 సీజ్ చేశారు. యువత బెట్టింగ్‌కు అలవాటై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని డీఎస్పీ కోరారు.

error: Content is protected !!