News March 23, 2025
WNP: చికిత్స పొందుతూ వివాహిత మృతి

ఆత్మకూర్ మండలంలో ఓ వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. బాలకృష్ణాపుర్‌కి చెందిన రాధ(34) గత కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పిని భరించలేక ఈనెల 10న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు HYDలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ 11 రోజులపాటు చికిత్స పొందుతూ నిన్న మృతిచెందింది.
Similar News
News April 23, 2025
వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

భూగర్భ వనరులను కాపాడుతూ.. నీటిని సంరక్షించేందుకు ప్రభుత్వం రూపొందించిన వాల్టా చట్టంని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. భూగర్భ జలాల పరిరక్షణపై భూగర్భ జలాల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని జనగామ కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, భూగర్భ జలాలను కాపాడుతూ వాటిని పెంపొందించాలన్నారు.
News April 23, 2025
నలుగురిపై కేసు.. ముగ్గురి అరెస్ట్: ADB SP

రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో 2 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సయ్యద్ యాసిన్, జనాబ్, ముబారక్‌లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రెండవ కేసులో హబీబ్, సర్దార్ (పరారీ) కేసు నమోదు చేశామన్నారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేశామని.. ఒకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 23, 2025
నిర్మల్: ‘LRS క్రమబద్ధీకరణ రుసుంలో 25% రాయితీ’

ఆమోదం పొందిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులంతా క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ లేఔట్ల క్రమబద్ధకరణకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఆమోదం పొందిన దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల క్రమబద్ధీకరణకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల పరిధిలో రుసుంలో 25% రాయితీ కల్పించిందన్నారు.