News March 10, 2025

WNP: చేపలవేటకు వెళ్లిన వ్యక్తి మృతి

image

మదనాపురం మండలంలో చేపలవేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. రామన్‌పాడుకు చెందిన గిరన్న (55) రోజు మాదిరిగానే తెల్లవారుజామున గ్రామ సమీపంలోని జలాశయంలో చేపలవేటకు వెళ్లాడు. ఎంతకూ ఇంటికి తిరిగిరాకపోవటంతో కుటుంబసభ్యులు జలాయశయంలో గాలించటంతో అతడి మృతదేహం లభ్యమైంది. రెండు కాళ్లకు వల చుట్టుకోవటంతో నీటి మునిగి మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News March 10, 2025

NZB: జిల్లా పంచాయతీ అధికారిగా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ

image

నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా డి.శ్రీనివాస్ రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా డీపీఓగా ఉన్న ఈయనను ప్రభుత్వం ఇటీవల నిజామాబాద్‌కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా డీపీఓ కార్యాలయం సిబ్బంది కొత్త డీపీఓకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీనివాస్ రావు జిల్లా కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

News March 10, 2025

అస్సాంకు సొంత ఉపగ్రహం

image

త్వరలో ‘అస్సాంశాట్’ అనే సొంత ఉపగ్రహాన్ని లాంఛ్ చేయనున్నట్లు అస్సాం ఆర్థిక మంత్రి అజంతా నియోగ్ ప్రకటించారు. సరిహద్దులపై నిఘాకు, కీలక సామాజిక-ఆర్థిక ప్రాజెక్టులపై సమాచారం కోసం ఈ శాటిలైట్‌ను వాడనున్నట్లు పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, విపత్తు నిర్వహణ, వ్యవసాయానికి కూడా అది ఉపకరిస్తుందని వివరించారు. ప్రయోగం పూర్తైతే సొంత శాటిలైట్ ఉన్న తొలి రాష్ట్రంగా అస్సాం నిలవనుంది.

News March 10, 2025

PPM: ’45 మందికి పైగా విద్యార్థులు ఉంటే మోడల్ ప్రైమరీ స్కూళ్లు’

image

45 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా పరిగణించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడిని ప్రభుత్వం నియమిస్తుందని అన్నారు. తద్వారా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే అవకాశం ఉంటుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

error: Content is protected !!