News March 4, 2025

WNP: జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ 

image

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వనపర్తి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ మార్చి1 నుంచి 31 వరకు అమల్లో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని చెప్పారు.

Similar News

News March 16, 2025

MBNR: బావిలో పడి వ్యక్తి మృతి

image

మిడ్జిల్ మండలంలో ఓ వ్యక్తి బావిలో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. స్థానికుల వివరాలు.. వేములకు చెందిన చంద్రయ్య(50) గురువారం రాత్రి గ్రామంలో చేసిన కాముడి దహన కార్యక్రమానికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా.. గ్రామ సమీపంలోని బావిలో పడిపోయారు. ఎవరూ గమనించకపోవటంతో మునిగిపోయారు. ఈ క్రమంలో శనివారం శవమై తేలాడు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.

News March 16, 2025

పీయూ బీఈడీ మూడో సెమిస్టర్ టైమ్ టేబుల్ విడుదల

image

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలో బీఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల టైమ్ టేబుల్ యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ప్రతి రోజు పరీక్షలను మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు పూర్తి టైమ్ టేబుల్ యూనివర్సిటీ వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు తెలిపారు. విద్యార్థులు గమనించాలని కోరారు. SHARE IT

News March 16, 2025

రేపటి నుంచే రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ

image

TG: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. OBMMS ఆన్‌లైన్ పోర్టల్‌‌లో ఏప్రిల్‌ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద SC, ST, BCలతో పాటు మైనార్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ₹3 లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనుంది. 60%-80% వరకు రాయితీ ఇస్తారు. దాదాపు 5 లక్షల మందికి ₹6వేల కోట్ల ఖర్చుతో ఈ రుణాలను అందించనుంది. వివరాలకు http//tgobmms.cgg.gov.in/ సంప్రదించండి.

error: Content is protected !!