News March 1, 2025
WNP: దివ్యాంగులందరూ యూడిఐడి కలిగి ఉండాలి: కలెక్టర్

దివ్యాంగులందరూ యూడిఐడి(యూనిక్ డిజేబుల్ ఐడి) కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం ఐడిఓసి సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న దివ్యాంగులకు అందరికీ యూడీఐడీ కలిగి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అందుకు సంబంధించి జిల్లాలోని సంబంధిత అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు.
Similar News
News March 3, 2025
కర్నూలు జిల్లాలో 336 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్2 పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జిల్లాలో 336 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు RIO గురవయ్య శెట్టి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20,506 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 20,160 మంది హాజరయ్యారని అన్నారు. పత్తికొండ జీజేసీలో ఆరుగురు, మిగతా కళాశాలల్లో నలుగురిపై నలుగురిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.
News March 3, 2025
వారానికి 60 గంటల పని: గూగుల్ కో ఫౌండర్

ఉద్యోగులను యంత్రాలుగా చూస్తున్న వారి జాబితాలోకి గూగుల్ కో ఫౌండర్ సెర్జీ బ్రిన్ కూడా వచ్చేశారు. ఇప్పటికే నారాయణమూర్తి, L&T సంస్థల ఫౌండర్లు 70 గంటలు పనిచేయాలని కామెంట్ చేయగా, సెర్జీ బ్రిన్ కూడా ఇలానే మాట్లాడారు. ‘AI రేసులో నిలవాలంటే వారానికి 60 గంటలు పనిచేయాలి. ప్రతిరోజూ ఆఫీసుకు రావాలి. అప్పుడే మంచి ప్రొడక్టివిటీ వస్తుంది. ఈ రేసులో మనం నిలవాలి, గెలవాలంటే తప్పదు’ అని ఆయన ఉద్యోగులకు నోట్ రాశారు.
News March 3, 2025
HYD: ‘కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి’

కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రండి చర్చకు సిద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యాయని, మెట్రో విస్తరణ కూడా కాంగ్రెస్ హయాంలోని జరుగుతుందన్నారు. ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదన్నారు.