News February 10, 2025
WNP: నీటి గుంతలో పడి బాలుడి మృతి

నీటిగుంతలో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన పాన్‌గల్ మండలం మాధవరావుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన నందిని, వినోద్‌ల కుమారుడు రుద్రరాజు(2) ఆదివారం పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా.. పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. చిన్నారిని వెంటనే బయటికి తీసి ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చిన్నారి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News April 14, 2026
40 నిమిషాల పాటు మోదీ-ట్రంప్ ఫోన్ కాల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్ కాల్‌లో 40 నిమిషాల పాటు మాట్లాడారు. US-ఇరాన్ సీజ్‌ఫైర్ ప్రకటించాక వీరిద్దరూ కాల్ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. పశ్చిమాసియాలోని పరిస్థితులు సహా వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యంపై చర్చించారు. హార్ముజ్ భద్రతపైన కూడా చర్చించినట్లు ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
News April 14, 2026
HYDలో భారీ మోసం.. ఇద్దరు అరెస్ట్

నగరంలో విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న భారీ మోసాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు బట్టబయలు చేశారు. యూరప్ దేశాల్లో ఉద్యోగాలంటూ ఒక్కో వ్యక్తి నుంచి రూ.4 నుంచి 5 లక్షలు వసూలు చేస్తున్న ‘ట్రివియల్ చాప్టర్’ సంస్థకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ప్రకటనలు, నకిలీ ఆఫర్ లెటర్లతో ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు
News April 14, 2026
జనగణనను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

జనగణన 2027లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెల్ఫ్-ఎన్యూమరేషన్ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకోవచ్చన్నారు. ఇందుకు ప్రత్యేకంగా రూపొందించిన అధికారిక వెబ్‌సైట్ https://se.census.gov.in ద్వారా సులభంగా నమోదుచేసుకోవచ్చన్నారు.


