News February 10, 2025
WNP: నీటి గుంతలో పడి బాలుడి మృతి

నీటిగుంతలో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన పాన్‌గల్ మండలం మాధవరావుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన నందిని, వినోద్‌ల కుమారుడు రుద్రరాజు(2) ఆదివారం పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా.. పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. చిన్నారిని వెంటనే బయటికి తీసి ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చిన్నారి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News October 30, 2025
అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా పంకజ్ కుమార్ మీనా

చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా నియమితులయ్యారు. ఈమేరకు DGP హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పంకజ్ కుమార్ మీనా చింతూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలో గంజాయి నిర్మూలన, మావోయిస్టుల కార్యకలాపాల నియంత్రణకు విశేష కృషి చేశారు.
News October 30, 2025
ఖమ్మం: బట్టిపట్టే చదువుకు స్వస్తి – ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ ప్రారంభం

ప్రతి విద్యార్థిలో చదివే సామర్థ్యం పెంపొందించే లక్ష్యంతో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రోజూ గంటసేపు రీడింగ్ స్కిల్స్ అభ్యాసం చేయించాలని సూచించారు. 30 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి విద్యార్థి చదివి అర్థం చేసుకునే స్థాయికి చేరడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు.
News October 30, 2025
రెబ్బెన పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

రెబ్బెన PSను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గురువారం సందర్శించి తనిఖీ చేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి సిబ్బంది అందరితో మాట్లాడారు. అనతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్లో రికార్డ్స్‌ను, పరిసరాలను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ రిసెప్షన్, పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో ఎక్కువగా ఎలాంటి నేరాలు జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.


