News February 10, 2025

WNP: నీటి గుంతలో పడి బాలుడి మృతి

image

నీటిగుంతలో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన పాన్‌గల్ మండలం మాధవరావుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన నందిని, వినోద్‌ల కుమారుడు రుద్రరాజు(2) ఆదివారం పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా.. పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. చిన్నారిని వెంటనే బయటికి తీసి ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చిన్నారి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Similar News

News March 27, 2025

ఈ వీకెండ్ ఏ సినిమాకు వెళ్తున్నారు?

image

నేటి నుంచి ఈనెల 30 వరకు పలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇవాళ మోహన్‌లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’ థియేటర్లలో సందడి చేయనుంది. రేపు ‘మ్యాడ్ స్క్వేర్‌’తో పాటు నితిన్-శ్రీలీల నటించిన ‘రాబిన్‌హుడ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈనెల 30న సల్మాన్ ఖాన్ నటించిన ‘సికందర్'(హిందీ) కూడా విడుదల కానుంది. మరి ఈ వీకెండ్ మీరు ఏ సినిమాకు వెళ్తున్నారు? కామెంట్ చేయండి.

News March 27, 2025

ఆత్మకూరు హైవే పక్కన అస్థిపంజరం లభ్యం

image

ఆత్మకూరు జాతీయ రహదారి నుంచి అల్లిపురం క్రాస్ రోడ్డు వద్ద బుధవారం గుర్తుతెలియని పూర్తిగా ఎముకల గూడుగా ఉన్న అస్థిపంజరం లభ్యమయింది. ఈ అస్థిపంజరం మగ వ్యక్తిదని, చనిపోయిన వ్యక్తి వయస్సు సుమారు 58-60 ఏళ్ల మధ్య ఉండొచ్చని ఆత్మకూరు ఎస్ఐ తెలిపారు. ఎవరైనా ఈ శవం ఆనవాళ్లను గుర్తిస్తే 9440796390 నంబరుకు వివరాలు తెలియజేయాలని SI కోరారు.

News March 27, 2025

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య?

image

సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని బ్రహ్మేశ్వరంపల్లిలో మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మండల పరిధిలోని మొరసలపల్లికి చెందిన అర్చనను బ్రహ్మేశ్వరం పల్లి గ్రామానికి చెందిన శివశంకర్ వివాహం చేసుకున్నాడు. వారికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె బలవన్మరణానికి పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కుమార్తెను అత్తింటి వారే చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!