News February 10, 2025

WNP: నీటి గుంతలో పడి బాలుడి మృతి

image

నీటిగుంతలో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన పాన్‌గల్ మండలం మాధవరావుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన నందిని, వినోద్‌ల కుమారుడు రుద్రరాజు(2) ఆదివారం పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా.. పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. చిన్నారిని వెంటనే బయటికి తీసి ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చిన్నారి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Similar News

News November 27, 2025

MBNR: ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ డి.జానకి ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయిని దేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆమె వివరించారు. అనంతరం ఎస్పీ జానకి అల్లిపూర్ గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

News November 27, 2025

పన్నూర్: డాక్యుమెంట్లు లేకుంటే రసీదు ఇవ్వాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సమయంలో అభ్యర్థులు ఏదైనా డాక్యుమెంట్ సమర్పించని పక్షంలో, ఆ వివరాలు, గడువుతో కూడిన రసీదు తప్పనిసరిగా అందించాలని రామగిరి మండలం పన్నూరులో కలెక్టర్ తెలిపారు. పన్నూరులోని నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్.. ప్రతి నామినేషన్‌ను టీ-పోల్లో నమోదు చేయాలని, అలాగే ఓటర్ జాబితాలో అభ్యర్థి పేరును క్రాస్ చెక్ చేసుకోవాలని అధికారులకు సూచించారు.

News November 27, 2025

SKLM: బూత్ లెవెల్ ఆఫీసర్స్ చేర్పులు, మార్పులు పూర్తి చేయాలి

image

8 నియోజకవర్గాల్లో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఓటర్ లిస్టులో చేర్పులు, మార్పులు, దిద్దుబాట్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయా నియోజకవర్గాల్లో గల EROలు, AEROలతో మాట్లాడి ఫారం 6,7,8లకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం సూచించిన ప్రక్రియను సకాలంలో పూర్తిచేసి నివేదికలు అందించాలన్నారు.