News January 27, 2025

WNP: ‘పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’

image

ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వనపర్తి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. సోమవారం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, పర్యావరణ విద్య, నైతిక మానవ విలువల పరీక్షల నిర్వహణ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Similar News

News November 25, 2025

తిరుమల శ్రీవారి సారెలో ఏముంటాయంటే?

image

పంచమి తీర్థం సందర్భంగా తిరుమల ఆలయం నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సారె ఇస్తారు. 2పట్టు చీరలు, రవికలు, పసుపు ముద్ద, శ్రీగంధం కర్ర, పచ్చని పసుపు కొమ్ముల చెట్లు, పూలమాలలు, తులసీ మాల, బంగారు హారం, ఒకే పడి(51) పెద్ద లడ్డూలు, ఒకే పడి(51) వడలు, ఒకే పడి(51) అప్పాలు, ఒకే పడి (51) దోసెలు ఉంటాయి. ముందుగా స్వామివారికి సమర్పించి ఊరేగింపుగా అలిపిరికి.. అక్కడి నుంచి ఏనుగుపై తిరుచానూరుకు తీసుకెళ్తారు.

News November 25, 2025

ఇతిహాసాలు క్విజ్ – 77

image

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 25, 2025

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

ఇస్రో-<>విక్రమ్ <<>>సారాభాయ్ స్పేస్ సెంటర్ 5 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, బీడీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 70ఏళ్లలోపు ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. chsshelp@vssc.gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్: www.vssc.gov.in