News March 5, 2025

WNP: ప్రజావాణిలో దరఖాస్తులను స్వీకరించిన చిన్నారెడ్డి

image

హైదరాబాద్ మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రజావాణికి 401 దరఖాస్తులు రాగ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి దరఖాస్తులను స్వీకరించారు. గ్రామీణ అభివృద్ధి శాఖకు చెందినవి 60, రెవెన్యూ 38, ఇందిరమ్మ ఇండ్లకు 216, ఇతర దరఖాస్తులు 47 వచ్చాయి. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

Similar News

News December 16, 2025

IPL.. పతిరణకు రూ.18 కోట్లు

image

శ్రీలంక యంగ్ బౌలర్ మతీశా పతిరణను రూ.18 కోట్లకు KKR కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ఇతడి కోసం ఢిల్లీ, లక్నో పోటీ పడ్డాయి. డెత్ ఓవర్లలో యార్కర్లు వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించడం పతిరణ స్పెషల్. ఇతడు గతంలో చెన్నై తరఫున ఆడారు. సౌతాఫ్రికా బౌలర్ నోర్జ్‌ను లక్నో రూ.2 కోట్లకు దక్కించుకుంది. అటు భారత స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు.

News December 16, 2025

గుంటూరు యార్డులో ‘ఘాటు’.. ఎల్లో మిర్చి @ రూ.280

image

గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం 60 వేల బస్తాల ఏసీ సరుకు పోటెత్తింది. మార్కెట్‌లో ఎల్లో రకం మిర్చి రికార్డు స్థాయిలో కిలో రూ.200 నుంచి రూ.280 పలికింది. ముఖ్యంగా 2043 ఏసీ రకం గరిష్టంగా రూ.200, నాటు సూపర్-10 రూ.180, నంబర్-5 రూ.175 వరకు అమ్ముడయ్యాయి. ప్రధాన రకమైన తేజా ఏసీ రూ.120-149, 355 రకం రూ.170, బుల్లెట్ రూ.165 పలికాయి. మీడియం సీడు రకాలు రూ.90-110, తాలు రకాలు రూ.60-90 మధ్య ధర పలికాయి.

News December 16, 2025

మండపేట: వేగుళ్లకి తోట త్రిమూర్తులు సవాల్

image

మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కేవలం అవకాశవాది మాత్రమేనని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ ఛైర్మన్, వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. మండపేట వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేది మేడిపండు నైజమని వ్యాఖ్యానించారు. ఆయనతో బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.