News February 6, 2025
WNP: బైక్, లారీ ఢీ.. ఒకరి దుర్మరణం

బైక్‌ని లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పాన్‌గల్ మండలం రేమొద్దులకి చెందిన నర్సింహారెడ్డి(55) తన సొంత పనుల మీద బైక్‌పై విలియంకొండకు వచ్చారు. తిరిగి ఇంటికెళ్తుండగా.. కొత్తకోట మదర్‌థెరిసా జంక్షన్ వద్ద ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. కేసు నమోదైంది.
Similar News
News October 13, 2025
NRPT: ఫిర్యాదులు చట్టం ప్రకారం పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను చట్టం ప్రకారం పరిష్కరించాలని ఎస్పీ వినీత్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు పంపించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పరు. మొత్తం నాలుగు ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ చెప్పారు.
News October 13, 2025
రాజమండ్రిలో యువ హీరో సందడి

అన్ని హంగులతో కూడిన వినోదాత్మక చిత్రంగా ‘కె – ర్యాంప్’ రూపొందిందని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. సినిమా ప్రమోషన్ నిమిత్తం ఆయన సోమవారం రాజమండ్రి వచ్చారు. జైన్స్ నాని దర్శకత్వంలో, హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం దీపావళి రోజున విడుదల కానుందని చెప్పారు. సినిమా ఆద్యంతం వేగంగా, స్పీడుగా నడుస్తుందనే ఉద్దేశంతోనే ‘ర్యాంప్’ అనే పేరు పెట్టామని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.
News October 13, 2025
నకిలీ మద్యం కేసు.. జోగి రమేశ్ సవాల్

AP: నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి <<17996336>>జోగి రమేశ్<<>> మరోసారి స్పందించారు. ఇదంతా చంద్రబాబు అల్లిన కట్టు కథ అని ఆరోపించారు. తిరుమల సన్నిధిలో ప్రమాణం చేసేందుకు, లై డిటెక్టర్ టెస్టుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ప్రమాణానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సిద్ధమా అని సవాల్ విసిరారు. జనార్ధన్‌తో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని, బలవంతంగా అతనితో తన పేరు చెప్పించారని మండిపడ్డారు.