News January 25, 2025
WNP: మదనాపూర్ శివారులో వ్యక్తి ఆత్మహత్య.!

మదనాపురం మండల శివారులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు.. MBNR జిల్లా చిన్నచింతకుంట మండలం అల్లీపురం గ్రామానికి చెందిన షబ్బీర్, గత కొంత కాలంగా కొత్తకోటలో ఉంటూ వంటలు చేస్తూ ఉండేవాడని, ఈరోజు ఉదయం దారిలో వెళ్తున్న వారు గమనించి ఉరి వేసుకున్న వ్యక్తిని గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 5, 2025
సిద్దిపేట: రెండవ రోజు 295 నామినేషన్లు దాఖలు

సిద్దిపేట జిల్లాలో మూడవ విడత తొమ్మిది మండలాల పరిధిలోని 163 గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు 295 నామినేషన్లు దాఖలు కాగా, ఇప్పటి వరకు మొత్తంగా 468 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. అటు 1432 వార్డులకు గానూ రెండవ రోజు 1111 నామినేషన్లు దాఖలు కాగా, మొత్తం 1472 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. రేపు నామినేషన్లకు చివరి రోజు
News December 5, 2025
విజయనగరంలో డిగ్రీ విద్యార్థి సూసైడ్

విజయనగరంలోని స్థానిక ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఓ విద్యార్థిని గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహారాజా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న స్వాతిగా పోలీసులు గుర్తించారు. ఈమె స్వస్థలం శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంగా తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
News December 5, 2025
డిసెంబర్, జనవరి పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

శ్రీవారి ఆలయంలో డిసెంబర్ నుంచి జనవరి వరకు జరిగే పలు పర్వదినాలు, ప్రత్యేక కైంకర్యాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిర్ణీత రోజుల్లో టీటీడీ రద్దు చేసినట్లు ప్రకటించింది. 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 29న వైకుంఠ ఏకాదశి ముందు రోజు నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి. ఈ తేదీలకు ముందురోజు వీఐపీ దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది.


