News January 25, 2025

WNP: మదనాపూర్ శివారులో వ్యక్తి ఆత్మహత్య.!

image

మదనాపురం మండల శివారులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు.. MBNR జిల్లా చిన్నచింతకుంట మండలం అల్లీపురం గ్రామానికి చెందిన షబ్బీర్, గత కొంత కాలంగా కొత్తకోటలో ఉంటూ వంటలు చేస్తూ ఉండేవాడని, ఈరోజు ఉదయం దారిలో వెళ్తున్న వారు గమనించి ఉరి వేసుకున్న వ్యక్తిని గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 14, 2025

తెలుగు డైరెక్టర్ తండ్రి కన్నుమూత

image

తెలుగు సినిమా దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తండ్రి ఏలేటి సుబ్బారావు (75) కన్నుమూశారు. తూ.గో జిల్లా తుని మం. రేఖవానిపాలెంలోని తన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, రాజమౌళి భార్య ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ‘ఐతే’ మూవీతో కెరీర్ ప్రారంభించిన చంద్రశేఖర్ అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా లాంటి సినిమాలు తీశారు.

News February 14, 2025

శావల్యాపురంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

image

శావల్యాపురంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని గుంటూరు-కర్నూలు రహదారిపై సోసైటీ కార్యాలయం వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం 108 సిబ్బంది వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

News February 14, 2025

కర్నూలులో బర్డ్ ఫ్లూ తొలి కేసు.. రెడ్ జోన్‌గా ప్రకటన

image

కర్నూలులో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నరసింహారావు పేటలో నమోదైనట్లు KMC ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో నరసింహారావు పేట, పరిసర ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించినట్లు వెల్లడించారు. సంకల్ప్ బాగ్‌లో ఓ వ్యక్తి తన నివాసంలో కోడిని పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఆ కోడి చనిపోవడంతో పరీక్షలు చేయించాడు. పరీక్షలో బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

error: Content is protected !!